ఒకప్పుడు భారత దేశంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాత్ అల్లుడు పాడిన ‘కొలవెరి’సాంగ్ గుర్తుంది కదా..ఆ పాట కంపోజ్ చేసిన కుర్రాడు అనిరుథ్ ఇప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్నాడు. తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగి టాలీవుడ్లో `అజ్ఞాతవాసి`తో అరంగేట్రం చేశాడు అనిరుధ్. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కాంబినేషన్లో సినిమాతో ఎంట్రీ ఇస్తుండడంతో అనిరుధ్‌పై అంచనాలు తారస్థాయికి చేరిపోయాయి. కాకపోతే అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినప్పటికీ మ్యూజిక్ పరంగా మంచి హిట్ అయ్యింది.
ఎన్టీయార్‌తో త్రివిక్రమ్ చేస్తున్న `అరవింద సమేత`కు కూడా మొదటగా అనిరుధ్‌నే సంగీత దర్శకుడు అని ప్రకటించారు. అయితే `అజ్ఞాతవాసి` ఎఫెక్ట్ కారణంగా ఆ అవకాశం థమన్‌ను వరించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అనిరుథ్ కి తెలుగు లో మరో ఛాన్స్ వచ్చింది.
నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `జెర్సీ`కి సంగీతం అందించే అవకాశం అనిరుధ్‌కు వచ్చింది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుథ్ అయితే బాగుంటుందని భావించి ఆయనను సంప్రదిస్తే .. ఓకే చెప్పాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.