మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన తరువాత త్రివిక్రమ్ క్రేజ్ టాలీవుడ్ లో మరింత పెరిగిపోయింది. పంచ్ డైలాగ్స్ స్పెషలిస్ట్ గా పేరుగాంచిన త్రివిక్రమ్ కలం నుండి వచ్చిన డైలాగ్స్ అత్తారింటికి దారేది ఘన విజయంలో ప్రముఖ పాత్రను పోషించాయి. సామాన్యంగా పవన్ మీడియా కు దూరంగా ఉంటాడు కాబట్టి అత్తారింటి సినిమా మీడియా ప్రమోషన్ పని కూడా ప్రస్తుతం సమంతతో కలిపి త్రివిక్రమ్ మోస్తూ, ఈ సినిమాకు వీలైనంత ఎక్కువ కలెక్షన్స్ వచ్చేలా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ తియ్యబోయే తదుపరి సినిమాలో ఎవరు హీరో అంటూ ఆశక్తి దాయకమైన చర్చ టాలీవుడ్ లో జరుగుతోంది.

మహేష్, అల్లు అర్జున్, పవన్ లాంటి టాప్ హీరోలతో సినిమాలు చేసిన త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోయే కొత్త సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఉంటాడు అనీ వార్తలు వస్తున్నాయి. ఈ లిస్టు లో రామ్ చరణ్ కూడా ఉన్నప్పటికీ త్రివిక్రమ్ చెయ్యబోయే కొత్త సినిమా మాత్రం జూనియర్ తోనే ఉంటుంది అంటూ ఫిల్మ్ నగర్ లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్, అల్లు అర్జున్, పవన్ లతో సినిమాలు తీసి సూపర్ హిట్స్ కొట్టిన త్రివిక్రమ్ కు జూనియర్ తో సినిమా తీయడం అంత సులువు కాదు అంటూ విమర్శకులు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం త్రివిక్రమ్ సినిమాలు మాస్ మసాలా కు కొద్దిగా దూరంగా ఉంటాయి. మహేష్, పవన్ లతో సినిమాలు తీసినప్పుడు ఆ హీరోల ఇమేజ్ వల్ల త్రివిక్రమ్ ఆ సినిమాలను కుటుంబ సినిమాలుగా రూపొందించినా, ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. కాని జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఇది విభిన్నం అని అంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కన్నా జూనియర్ కు మాస్ ఆడియన్స్ ఎక్కువ.

ఈ నేపధ్యంలో మాస్ ను దృష్టిలో పెట్టుకొని కధను రాసుకోకుండా ఇప్పటిదాకా త్రివిక్రమ్ రాసిన కధల పంధాలో జూనియర్ కి కూడా కధ రాస్తే జూనియర్ అభిమానులను మెప్పించడం కష్టం అంటూ ఒక కొత్త పాయింట్ ను టాలీవుడ్ విశ్లేషకులు తెరపైకి తీసుకువస్తున్నారు. ఈ వార్తల నేపధ్యంలో అసలు త్రివిక్రమ్ సాహసించి జూనియర్ తో తన కొత్త సినిమాను తీస్తాడా..? లేకుంటే ఇప్పటికే త్రివిక్రమ్ ఎస్ అంటే కాల్ షీట్స్ ఇవ్వడానికి రెడీ గా ఉన్న మహేష్, చరణ్ లలో ఎవరో ఒకరిని తన కొత్త సినిమాకు హీరోగా ఎంచుకుంటాడా...? అదీ కాకుంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో భాగస్వామిగా మారి చిన్న సినిమాల నిర్మాతగా మారుతున్నాడు కాబట్టి కొత్త వారితో త్రివిక్రమ్ సినిమా తీస్తాడా..? అనే విషయం పై రకరకాల మాటలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అత్తారింటి సినిమా ఇచ్చిన హిట్ తో జోష్ మీద ఉన్న త్రివిక్రమ్ తియ్యబోయే కొత్త సినిమా ఏమిటి..? అనే విషయం తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: