అప్పట్లో ఎన్టీఆర్ స్టార్ హీరో హీరో అయ్యే క్రమంలో ఎన్టీఆర్ కు సమీరా రెడ్డికి మధ్య ఎదో సంబంధం ఉందని తెగ పుకార్లు, గాసిప్స్ వచ్చిన సంగతీ తెలిసిందే. ఎన్టీఆర్ తో 'నరసింహుడు'.. 'అశోక్'.. చిరంజీవి తో 'జై చిరంజీవా'.. చిత్రాలలో నటించింది సమీరా. వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇప్పటికే ఒక బాబు ఉన్న సమీరా ఇప్పుడు రెండోసారి ప్రెగ్నెంట్.  తాజాగా ఒక కాన్ఫరెన్స్ లో హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చింది.


మహిళల ఆరోగ్యం.. అమ్మదనం.. లాంటి అంశాలపై జరిగిన ఈ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ తన అభిప్రాయలు పంచుకుంది.  ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు సమాధానంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ తనకు మంచి స్నేహితుడని తెలిపింది. "ఎన్టీఆర్ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా చూస్తాను. ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్" అంటూ కితాబిచ్చింది. 


మళ్ళీ తెలుగు సినిమాల్లో నటిస్తారా అని ప్రశ్నిస్తే.. భావిష్యత్తులో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఉందని తెలిపింది.సమీరా చివరిసారిగా టాలీవుడ్ లో 'కృష్ణం వందే జగద్గురుం' (2012)సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇక తన చివరి సినిమా కన్నడలో 'వరదనాయక'(2013). ఆరేళ్ళ నుంచి సమీరా సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు సెకండ్ డెలివరీ ఉంది కాబట్టి మరో రెండేళ్ళు సినిమాలలో నటించకపోవచ్చు.  ఒకవేళ రీ ఎంట్రీ ఉంటే గింటే ఆ తర్వాతే.

మరింత సమాచారం తెలుసుకోండి: