మన్మధుడు సినిమా ఎలా ఉంటుందో చూశాం. ఆ సినిమా లవ్, రొమాంటిక్ ఎమోషన్ గా సాగుతుంది. అప్పట్లో అది క్లాసికల్ హిట్. ఇప్పుడు నాగార్జున మన్మధుడు 2 సినిమాను సెట్ చేశాడు. ఇది పూర్తిగా రొమాంటిక్ ఎంటర్టైనర్. ఇందులో నాగార్జున వయసు పెద్దగా ఉన్నా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారు.
లేటు వయసులో పెళ్లి చేసుకోవాలి అనుకున్న సమయంలో అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అన్నది కథ. అందరికి తెలిసింది నాగ్ వర్జిన్ అని, కానీ, వెనకాల జరిగే రొమాంటిక్ లీలల గురించి ఎవరికీ తెలియదు. వాటిపై బోర్ కొట్టి పెళ్లి చేసుకోవాలని అనుకున్న సమయంలో ఎం జరిగింది అన్నది ఫన్నీగా చూపించబోతున్నారు.
మన్మధుడు సినిమాకు ఇది పూర్తి విరుద్ధంగా ఉన్నది. పేరుకు సీక్వెల్ మాత్రమే దాని ఫ్లేవర్ ఇందులో కొంచెం కూడా లేదు. పక్కా హ్యూమర్ తో రొమాంటిక్ గా సాగిన టీజర్ చాలా కూల్ గా ఉన్నది. ఒక్కమాటలో చెప్పాలంటే టీజర్ రొమాంటిక్ హిట్. ఈ వయసులో కూడా నాగార్జున ముద్దులతో అదరగొట్టాడు. మరి సినిమా లా ఉంటుందో చూడాలి.
ఆగష్టు 9 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది. దీన్ని అధికారికంగా టీజర్ లో ప్రకటించారు. ఈ టీజర్ నాగార్జునను మాత్రమే చూపించి హీరోయిన్ల గురించి దాచిపెట్టడం విశేషం. ట్రైలర్ లో వాళ్ళ రోల్స్ ను రివీల్ చేస్తారేమో.