బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వయసు యాభై దాటినా ఇప్పటికి యంగ్ గా కనిపిస్తుంటారు. కుర్ర హీరోయిన్లతో స్టెప్పులు వేస్తుంటారు. ఇప్పుడు సినిమా రంగంలో యాభై పైబడిన హీరోలు ఎందరో ఉన్నారు. వాళ్లందరికంటే సల్మాన్ వెరీ స్పెషల్. డైట్ విషయంలో ఏం తీసుకున్నా సరే.. జిమ్ ద్వారా దాన్ని కరిగించేస్తాడు. సాధారణంగా యాభై దాటాకా రిస్క్ తీసుకునే వ్యాయామం చేయకూడదు. సల్మాన్ మాత్రం అలా కాదు. వయసుతో సంబంధం లేకుండా బరువులు ఎత్తేస్తుంటాడు. ప్రతి ఒక్కరితో కలిసిపోయి ఫ్రెండ్లీ నేచర్ ను అలవాటు చేసుకున్న సల్మాన్ ఇప్పటి వరకు వివాహం చేసుకోలేదు.
ఎందుకు అంటే అయన చెప్పే సమాధానం భలే విచిత్రంగా ఉంటుంది. తనను పెళ్లి చేసుకోమని ఎవరు అడగలేదని, పెళ్ళైతే మంచి భర్తగా ఉండలేనని అంటూనే.. తనకు తండ్రి కావాలనే కోరిక ఉందని, మంచి తండ్రిని కాగలనని అంటున్నాడు. సినిమా ఇండస్ట్రీలో వారసులు అవసరం చాలా ఉంటుంది. అందుకే వారసుల కోసం ఆరాట పడుతుంటారు. బాలీవుడ్ లో సల్మాన్ కు లాగానే టాలీవుడ్ లో ప్రభాస్ కూడా పెళ్లి విషయంలో ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు.
బాహుబలి సినిమాకు ముందు ప్రభాస్ వివాహం చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. నిజానిజాలు పక్కన పెడితే.. బాహుబలి సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు దాటింది. బాహుబలి తరువాత సాహు సినిమాలో బిజీ అయ్యారు. ఈ సినిమా ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఎలాగో ఈ మూవీ కూడా రిలీజ్ కాబోతున్నది. దీని తరువాతైనా ప్రభాస్ పెళ్ళి చేసుకుంటాడా .. కనీసం పెళ్ళికి సంబంధించిన సమచరం ఎమైనా ప్రభాస్ నుంచి వస్తుందా..? ప్రస్తుతానికి ఇవన్ని ప్రశ్నలే... జవాబులు దొరకలంటే..ప్రభాస్ చెప్పాల్సిందే.
పెళ్ళి గురించి ప్రభాస్ ను అడిగితే... తనకు తెలియదని అదంతా పెదనాన్న చూసుకుంటారని చెప్పి తప్పించుకుంటున్నాడు. ప్రభాస్ పెళ్ళి విషయమే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ అమెరికాకు చెందిన ఓ అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నారని, ఈ ఏడాదిలోనే ప్రభాస్ పెళ్ళి వార్త వినొచ్చన్ని కొందరు చెప్తున్నారు. ఎంతమంది ఎన్ని చెప్పినా... ప్రభాస్ మనసులో ఏమున్నదో... ఎవరికి తెలుసు చెప్పండి. అసలు పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం ఉన్నదో లేదో... సల్మాన్ లా బ్యాచులర్ గా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నాడో.. దేవుడికే తెలియాలి.