డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన సినిమాకి సంబంధించిన షూటింగ్ విషయాలను అలాగే భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్ట్ విషయాలను ఇంకా అనేక రకాల విషయాల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకొంటారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా హరీష్ శంకర్ మెగాస్టార్ చిరంజీవి ఫోటో ని షేర్ చేశారు. అంతేకాకుండా ట్విట్టర్లో ఈ ఫోటో షేర్ చేయకుండా ఉండలేకపోతున్నాను అంటూ కామెంట్ కూడా పెట్టారు. ఫోటోని షేర్ చేస్తూ చిరంజీవి లుక్ అదిరిపోయింది అని ఫోటో గురించి మాట్లాడు డైరెక్టర్ కొరటాల శివ పై జలసీ ఉందని దానికి కారణం చిరంజీవితో చేయడమే...కొరటాల సినిమా కోసం చిరంజీవి ఇంత యంగ్ గా ఎలా తయారు అయ్యారని హరీష్ శంకర్ ప్రశ్నించారు.

View image on Twitter

అసలు హరీష్ శంకర్ సోషల్ మీడియా లో చిరంజీవి ఫోటో ని ఉద్దేశిస్తూ పెట్టిన పోస్ట్ ఏమిటంటే.. ''ఈ ఫోటోని పోస్ట్ చేయకుండా ఉండలేకపోతున్నాను.. మొదటిసారి నా స్నేహితుడు కొరటాల శివపై జెలసీగా ఉంది. వీరు ఎలాంటి సినిమా చేయబోతున్నారో అని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది'' అంటూ హరీష్ తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ఈ ట్వీట్ కి నెటిజన్ల నుండి భారీ స్పందన వస్తోంది.

Image result for chiranjeevi new look

ఈ క్రమంలో కొంత మంది మెగా అభిమానులు చిరంజీవితో మీరు కూడా సినిమా చేయాలని పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారో అలాగే చిరంజీవికి కూడా హిట్ ఇవ్వాలని అప్పట్లో చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి మాస్ సినిమా ఒకటి మీ నుండి ఆశిస్తున్నాము అంటూ మెగా అభిమానులు హరీష్ శంకర్ ని కోరారు. మొత్తం మీద చిరంజీవి ఫోటో ని ఉద్దేశించి డైరెక్టర్ హరీష్ శంకర్ కొరటాల శివ పై సోషల్ మీడియాలో షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు మెగా అభిమానులను బాగా అల్లరిస్తున్నట్లు అర్థమవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: