'ఇష్క్' ముందు వరకూ టాలీవుడ్ లో నితిన్ పరిస్ధితి ప్లాప్ అనే పదానికి పర్యాయపదం అనే రేంజ్ లో వుండేది. ఎట్టకేలకూ నితిన్ 'ఇష్క్' తరువాత 'గుండెజారి గల్లంతయ్యిందే' 'అ ఆ' సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. కానీ గత మూడు సినిమాలు 'లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం' ప్లాప్ లతో మళ్లీ ప్లాప్ ల పరంపరలో కొట్టుమిట్టాడుతున్నాడు. అందుకే ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఎంతో ప్లాన్ గా స్క్రిప్ట్ ను దగ్గరుండి రెడీ చేయించుకోని మరీ 'భీష్మ'ని ఫైనల్ చేశాడు. 'ఛలో' దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా 'భీష్మ' చిత్రం ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలో కామెడీ చాల బాగా వస్తోందని.. ముఖ్యంగా వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలోనే హైలెట్ గా నిలవబోతుందట. మొత్తానికి వెంకీ కుడుముల 'ఛలో' మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా ఫుల్ ఎంటెర్టైనింగా మలుస్తున్నాడట. ఇక ఈ సినిమాలో ఒక కీ రోల్ కోసం హెబ్బా పటేల్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో హెబ్బా పటేల్ పాత్ర బాగా బోల్డ్ గా ఉంటుందట. హెబ్బా - నితిన్ రొమాన్స్ కూడా సినిమాలో హైలెట్ నిలుస్తోందని చెబుతుంది చిత్రబృందం.
అయితే ఈ మధ్య ఛాన్స్ లు లేక కష్టాల్లో పడిన హెబ్బాకి ఈ సినిమాతోనైనా ఆమె ఆశించిన బ్రేక్, ఆమెకు దక్కుతుందేమో చూడాలి. అలాగే నితిన్ కూడా భీష్మ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి కనీసం ఈ సినిమానైనా నితిన్ ప్లాప్ లకు బ్రేక్ వేస్తోందేమో చూడాలి. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన మెయిన్ హీరోయిన్ గా రష్మిక మండన్నా నటిస్తోంది. ప్రస్తుతం నితిన్, 'భీష్మ'తో పాటు వెంకీ అట్లూరి దర్శకుడిగా తెరకెక్కుతున్న రంగ్ దే సినిమాలోనూ అలాగే విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. నితిన్ కొత్తగా ట్రై చేయాలనే ఉద్దేశ్యంతో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రానున్న వైవిధ్యంగా సాగే ఓ థ్రిల్లర్ సినిమాకి కూడా సైన్ చేశాడు.