వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో కొన్నేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవదాసు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్, తొలిసినిమానే మంచి విజయాన్ని అందుకోవడం తో హీరోగా మెల్లగా ఒక్కోక్కటిగా అవకాశాలను దక్కించుకున్నాడు.  అయితే ఆ విధంగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సాగుతున్న రామ్, మద్యలో కొన్ని హిట్స్ తో పాటుగా ఫ్లాప్స్ కూడా చవిచూడవలసి వచ్చింది. ఆ విధంగా కెరీర్ పరంగా ముందుకు వెళ్తున్న రామ్, ఇటీవల వరుస ఫ్లాపులతో కొంత ఢీలా పడడం జరిగింది. అయితే హఠాత్తుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోగా రామ్ కు అవకాశం రావడం, 

వెంటనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లి వెను వెంటనే షూటింగ్ పూర్తి చేసుకుని అనంతరం రిలీజ్ అవడం వంటివి చక చకా జరిగిపోయాయి. ఇక రిలీజ్ తరువాత ఆ సినిమా సూపర్ హిట్ సాధించి, కెరీర్ పరంగా రామ్ కు మంచి బ్రేక్ ని ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఇటీవల రామ్ నటించిన నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే సినిమాలు కొన్నాళ్ల క్రితం హిందీలో డబ్ కాబడి యూట్యూబ్ లో కూడా రిలీజ్ అయ్యాయి. అయితే నేటితో అవి మూడు కూడా 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రామ్ కు కెరీర్ పరంగా అత్యద్భుత రికార్డుని అందించాయి. నేను శైలజ(సూపర్ ఖిలాడీ3), హలో గురు ప్రేమ కోసమే (దందార్ ఖిలాడీ), 

ఉన్నది ఒక్కటే జిందగీ (నెంబర్ 1 దిల్వాలా) పేర్లతో రిలీజ్ అవ్వగా, వీటిలో సూపర్ ఖిలాడీ3, దందార్ ఖిలాడీ సినిమాలు చాలారోజుల క్రితమే 100 మిలియన్ల మార్కును అందుకోగా, నేడు నెంబర్ 1 దిల్వాలా 100 మిలియన్లకు చేరుకోవడం జరిగింది. ఈ విధంగా రామ్ నటించిన మూడు సినిమాలు ఇంత అత్యద్భుతంగా వ్యూస్ సాధించడం తో నేడు ఈ వార్త పెద్ద సెన్సేషన్ గా మారింది. ఇక దీనిపై రామ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా స్పందిస్తూ, నా సినిమాలకు ఈ విధంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ అందించి ఆదరించిన వీక్షకులకు ధన్యవాదాలు అంటూ ఒక పోస్ట్ చేయడం జరిగింది. కాగా ఈ వార్త నేడు పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: