మూడు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు వర్షన్ 4వ సీజన్ కు ఇప్పటి నుండే రంగం సిద్ధం చేస్తున్నారట్. కింగ్ నాగార్జున హోస్ట్ గా వచ్చిన బిగ్ బాస్ సీజన్ 3 ముందు జరిగిన రెండు సీజన్ల కన్నా ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. నాగార్జున కూడా హోస్ట్ గా మరోసారి మెప్పించారు. మీలో ఎవరు కోటీశ్వరుడు తర్వాత నాగార్జున చేసిన బిగ్ బాస్ షో కూడా ఆయనకు మంచి పేరు తెచ్చింది.


అసలైతే బిగ్ బాస్ కు ఒకరే హోస్ట్ గా చేయాల్సి ఉంటుంది. హిందిలో 13 సీజన్లుగా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తూ వచ్చాడు. తెలుగులో మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా సెకండ్ సీజన్ లో నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశారు. ఇక మూడవ సీజన్ లో కింగ్ నాగార్జున హంగామా తెలిసిందే.


ఇదిలాఉంటే బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ ఎవరు చేస్తారంటూ సోషల్ మీడియాలో క్రేజీ డిస్కషన్ జరుగుతుంది. సీజన్ 4 నాగార్జున చేయనని చెప్పాడని వార్తలు రాగా వాటిల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తుంది. బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున చాలా ఎంజాయ్ చేశాడట. అందుకే నెక్స్ట్ సీజన్ కూడా హోస్ట్ గా తాను చేసేందుకు రెడీ అని చెప్పాడట. 2020 లో రానున్న బిగ్ బాస్ సీజన్ 4 కి కూడా నాగార్జున హోస్ట్ గా చేస్తాడని తెలుస్తుంది.


సీనియర్ హీరోగా ఓ పక్క సినిమాలు చేస్తున్నా సరే బుల్లితెర మీద హోస్ట్ గా అంటే స్పెషల్ క్రేజ్ వచ్చినట్టే. అందుకే నాగార్జున హోస్ట్ గా మళ్లీ మళ్లీ చేసేందుకు సై అంటున్నాడు. ఎం.ఈ.కే ద్వారా స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను అలరించిన నాగార్జున ఆ తర్వాత బిగ్ బాస్ హోస్ట్ గా కూడా మెప్పించాడు. బిగ్ బాస్ సీజన్ 4 చిరు హోస్ట్ గా చేస్తాడన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: