త్రివిక్రమ్ శ్రీనివాస్ తన  ‘అ’ సెంటిమెంట్ గురించి వివరణ ఇస్తూ తన జీవితంలోని అతి ముఖ్యమైన రెండు ‘అ ఆ’ ల గురించి క్లారిటీ ఇచ్చాడు. తన తల్లి సినిమాలు చూడటం మానేసిన తరువాత తన సినిమా కెరియర్ మొదలైంది అని చెపుతూ ఆమె తన సినిమాలు టివి లో వచ్చినప్పుడు మాత్రం చూస్తూ తనకు ఫోన్ చేసి ‘ఏరా నువ్వే తీసావా’ అంటూ అడుగుతుందని నవ్వుతూ చెప్పాడు. 

ఆమె అలా కామెంట్ చేసినప్పుడల్లా తన పై తన సమర్థత పై నమ్మకం లేక అలా అడుగుతోంద లేదంటే జోక్ చేస్తోందా అన్న సందేహాలు తనకు కలుగుతాయి అంటూ కామెంట్ చేసాడు. ఇక తన భార్య సౌజన్య అయితే ఎవరి సినిమాలు చూడదనీ అందువల్ల తాను కూడ ఆమెతో సినిమాల విషయం మాట్లాడను అంటూ కామెంట్ చేసాడు.

అయితే తన సినిమాలను మాత్రం ఆమె ధియేటర్ లో చూస్తుందని చెపుతూ తాను తీసిన ఫెయిల్యూర్ సినిమాలు కూడ బాగా ఉన్నాయి కదా ఎందుకు ఫెయిల్ అయ్యాయి అంటూ ఆమె ప్రశ్నించే ప్రశ్నలో తనకు మరిన్ని ప్రశ్నలు కనపడతాయి అంటూ జోక్ చేసాడు. అంతేకాదు ప్రేక్షకులు అంతా తన భార్యలా ఉంటే సమస్య ఉండదనీ సినిమా పరిశ్రమ అంతా పచ్చగా ఉంటూ ఫెయిల్యూర్స్ లేకుండా అందరి జీవితాలు బాగుంటాయి అంటూ త్రివిక్రమ్ అభిప్రాయ పడుతున్నాడు. 

వాస్తవానికి చాల మందికి తన భార్య గురించి తన తల్లి గురించి ఎవరికీ తెలియదనీ వాళ్ళమీద తనకున్న ప్రేమను బాహాటంగా వ్యక్తపరుస్తూ పబ్లిసిటీ చేసుకోవడం తనకు రాదు అంటూ కామెంట్ చేసాడు. త్రివిక్రమ్ భార్య సౌజన్య మంచి శాస్త్రీయ నృత్య కళాకారిణి మాత్రమే కాకుండా ఆమె ఇప్పటికే అనేక ప్రదర్శనలు ఇచ్చింది. అయితే ఆమె కూడ ఎక్కడా త్రివిక్రమ్ తన భర్త అని చెప్పుకోకుండా తనకు తానుగా క్లాసికల్ డాన్సర్ గా రాణిస్తున్న విషయం అందరికీ తె

మరింత సమాచారం తెలుసుకోండి: