ప్రియాంక చోప్రా ఒకప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్. అందులో సందేహం అవసరం లేదు. వరసగా ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసింది. భారీ విజయాలు అందుకుంది. 36 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోకుండా, తనకు నచ్చిన తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనస్ ను వివాహం చేసుకుంది ఈ స్టార్ హీరోయిన్. ప్రస్తుతం యూఎస్ లో ఉంటున్నది. అక్కడే ఉంటూ అక్కడి నుంచే పనులు చక్కబెడుతున్నది.
ఇక ఇదిలా ఉంటె, ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు న్యూయార్క్ నగరంలో ఉంటున్నది. అక్కడే ఉంటూ హాలీవుడ్ స్టార్స్ తో పరిచయాలు పెంచుకుంటున్నది. అంతర్జాతీయంగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది ప్రియాంక. ప్రియాంక చోప్రా రీసెంట్ గా బజార్ అనే మ్యాగజైన్ కవర్ పేజీకి ఫోజులు ఇచ్చింది. కవర్ పేజీకి ఇచ్చిన ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మామూలుగానే ప్రియాంక చోప్రాకు ఫాన్ ఫాలోయింగ్ అధికంగా ఉంటుంది. ఆమె ఫోటోలకు ఫిదా అయ్యే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఒక్క ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ అయితే చాలు లక్షల సంఖ్యలో లైక్ లు షేర్ లు వచ్చిపడుతుంటాయి. దీంతో భారీగా ఆదాయం కూడా లభిస్తుంది. స్టార్స్ కు ఇది అదనపు ఆదాయం అని కూడా చెప్పొచ్చు. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యే వ్యక్తులు వారికి సంబంధించిన అకౌంట్స్ ద్వారా ఫోటోను షేర్ చేస్తే చాలు కోట్ల రూపాయలు వచ్చిపడుతుంటాయి.
ఇందులో ప్రియాంక చోప్రా ఎక్స్ పర్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆమె ఫోటోలు ఒక్కసారి షేర్ చేస్తే చాలు... సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. ఇక హాలీవుడ్ ఇండస్ట్రీ ఇచ్చే పార్టీల కోసం ఆమె ధరించే డ్రెస్ లు చాలా వెరైటీగా ఉంటాయి. ఇటీవలే ఓ వేడుకకు ప్రియాంక వేసుకున్న డ్రెస్ వైరల్ అయ్యింది. అంతకు మించి వివాదమే అయ్యింది. హాలీవుడ్ కు వెళ్తే ఇలా డ్రెస్ చేసుకోవాలా అంటూ చాలామంది విమర్శలు కూడా చేశారు.