ఇప్పుడు టాలీవుడ్ కి పెళ్లికళ వచ్చింది.. మొన్నటి వరకు మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్నవారు ఇప్పుడు ఒక్కోక్కరూ ఇంటివారవుతున్నారు. ఇప్పటికే హ్యాపీడేస్ ఫేమ్ హీరో నిఖిల్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఎంగేజ్ మెంట్ జరిగిన నితిన్ వివాహం ఎప్పుడు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం వల్ల మాల్స్, రెస్టారెంట్స్ మరికొన్ని జనసమూహాలకు సంబంధించిన అన్నీ క్లోజ్ అయ్యాయి. అయితే కరోనా సమయంలో ఇప్పుడు శుభకార్యాలు జరిగినా.. కొద్ది మంది సమక్షంలోనే జరుపుకుంటున్నారు. రాజకీయ, క్రీడా, సినీ రంగానికి చెందిన వారి వివాహాలు ఇలా సైలెంట్ గా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిఖిల్ తన ఇంటి పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాడు. ఇక మొన్నటి వరకు రానా సైలెంట్ గా ఉన్నా.. తను కూడా ఎంగేజ్ మెంట్ కి సిద్దమవుతున్నాడు. హీరో నితిన్‌కి పెళ్లి కుదిరింది.
తన స్నేహితురాలు షాలిని మెడలో మూడు ముళ్లు వేయనున్నారు నితిన్. ఇంతలోనే కరోనా రావడంతో అది కాస్త వాయిదా పడింది. ప్రస్తుతం ప్రభుత్వాలు కూడా భారీ సమూహాలు, భారీ ఆర్భాటాలకు అనుమతులు ఇవ్వడం లేదు. అతి తక్కువ మందికి మాత్రమే శుభకార్యాలకు అనుమతులిస్తున్నారు. అతి తక్కువ మంది బంధువుల మధ్య వివాహం చేసుకోవడం ఇష్టం లేని వాళ్లంతా తమ వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు సద్దమణిగే వరకూ పెళ్లికి టైం తీసుకోవాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
నితిన్ తన పెళ్లి అందరికి గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తున్నానని.. అవసరమైతే తన పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేసుకోవాలని కూడా భావిస్తున్నాడట. ఇదిలా ఉంటే నితిన్, షాలిని కుటుంబాలు కొత్త పెళ్లి తేదీని ఇప్పటివరకు ప్రకటించలేదు. మరి ఇరుకుటుంబాలు నితిన్, షాలిని పెళ్లిపై ఏం నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.