తమ అభిమాన హీరోల కొత్త సినిమా అప్ డేట్స్ కోసం.. ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు, తమ కొత్త సినిమాల అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ను ఖుషీ చేయడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. దాంతో ప్రభాస్ ఫస్ట్ లుక్ కు కూడా రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. 

 

బాహుబలితో చాలా గ్యాప్ ఇవ్వడంతో.. ఏడాదికి కనీసం ఒక సినిమా అయినా చేయాలనుకుంటున్నాడు ప్రభాస్. గతేడాది సాహోతో ప్రేక్షకులను అలరించిన రెబల్ స్టార్.. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమాతో పాటు, నాగ్ అశ్విన్ తోనూ ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. అయితే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రాధాకృష్ణ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ ఏమైనా ఉంటాయేమోనని.. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

 

ప్రస్తుతం షూటింగ్స్ లేకపోవడంతో.. స్టార్ హీరోలు, తమ కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ మెంట్ తో పాటు అప్ డేట్ ఇస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ వీడియో.. మహేశ్ బాబు సర్కారు వారి పాట, అల్లు అర్జున్ పుష్ప లుక్ ను రివీల్ చేశారు. అలాగే బాలకృష్ణ సైతం పుట్టిన రోజు కానుకగా బోయపాటి ప్రాజెక్ట్ డిటైల్స్ ఎనౌన్స్ చేశారు. కానీ ప్రభాస్ కొత్త చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. దాంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

 

ప్రభాస్ 20వ సినిమా ప్రారంభం అయ్యి చాలా రోజులయింది. అయినా ఇప్పటి వరకు కనీసం ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయకపోవడంపై ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఇంకెప్పుడు.. అంటూ ఒత్తిడి పెరిగిపోతోంది. ఎట్టకేలకు ఫ్యాన్స్ ఒత్తిడితో ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను ఈ నెల 14వ తేదీన రివీల్ చేయాలనుకుంటున్నారట. దాంతో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందనే ఆసక్తి ఏర్పడింది. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే.. జూన్ 14వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: