బాజీరావు మస్తాని సినిమా అనగానే చాలా మందికి కళ్ళ ముందు కనపడే పాత్రలు మూడు. బాజీరావు, మస్తాని, కాశీ. వీరు ముగ్గురు సినిమాలో ఒక రేంజ్ లో నటించారు అని సినిమా చూసిన ఎవరికి అయినా సరే స్పష్టంగా అర్ధమవుతుంది. సినిమాలో ప్రతీ సీన్ ని కూడా వాళ్ళే ఒక రేంజ్ కి తీసుకుని వెళ్ళారు అని చెప్పాలి. ప్రతీ సీన్ లో కూడా వాళ్ళు సినిమా స్థాయి ని మరో స్థాయికి తీసుకుని వెళ్ళారు. ఇక ప్రియాంకా చోప్రా విషయానికి వస్తే బాజీరావు భార్య గా ఆమె ఈ సినిమాలో నటిస్తుంది. ప్రతీ సీన్ లో కూడా ఆమె చాలా గొప్ప గా చేస్తుంది అని సినిమా చూసిన ఎవరికి అయినా సరే అర్ధమవుతుంది.
బాజీరావు యుద్దానికి వెళ్లి వచ్చిన తర్వాత స్వాగతం పలికే సన్నివేశం సినిమాలో హైలెట్ గా ఉంటుంది. ఆ సీన్ లో ఆమె నటన చూసిన బాలీవుడ్ అయిన ఏ సినిమా పరిశ్రమ అయినా సరే షేక్ అయింది అనే చెప్పాలి. అదే విధంగా బాజీరావు స్నానం చేసే సమయంలో ఆమె ఆ గదిలోకి వస్తారు ఇక ఆ సమయంలో రోమాన్స్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ లో ఆమె నటన గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. రోమాన్స్ అయిన తర్వాత ఆమె కనపడిన తీరు, అలాగే బాజీరావు యుద్ద సామాగ్రిని ఆమె ధరించి నటించిన తీరు చాలా బాగా ఆకట్టుకుంటుంది.
బాజీరావు చుట్టూ ఆమె తిరిగి గుర్రం సవారి చేస్తుంది. ఇక బాజీరావు కి మస్తాని ఉంది అని తెలిసిన తర్వాత, దివానీ మస్తాని పాట లో బాజీరావు ని మస్తానీ ని చూసిన సమయంలో, అదే విధంగా బాజీరావు చనిపోయిన సమయంలో ఆమె నటన సినిమాకే హైలెట్.