ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దేశ వ్యాప్తంగా ఎందరో హీరోలకు తన గాత్ర దానం చేసాడు. అలాంటి గాన గంధ్వర్వుడు కి మరో సింగర్ తో ప్లే బ్యాక్ పాడించడం ఒక అరుదైన సంఘటన. బాలు కు ఏఆర్ రెహమాన్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. 1997లో వచ్చిన నాగార్జున మూవీ ‘రక్షకుడు’ లో బాలు ఒక కీలక పాత్రలో నటించారు. నాగార్జునకు తండ్రిగా బాలు పాత్ర ఆమూవీలో ఉంటుంది. ఆ మూవీలో వచ్చే ఒక పాట నాగార్జున బాలసుబ్రహ్మణ్యం లు ఇద్దరూ కలిసి నటించారు.
ఆ పాటలో నాగార్జున పాత్రలోని పాట కోసం బాలు పాడితే బాలు పాత్రలోని పాటను బాలు చేత పాడించకుండా పంజాబీ సింగర్ సుఖ్విందర్ సింగ్ చేత మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ వెరైటీగా పాడించాడు. అప్పట్లో ఆవిషయం ఒక సంచలనం ఇప్పుడు సుఖ్విందర్ సింగ్ బాలు చనిపోయిన వార్తను తెలుసుకుని 40 వేల పాటలు పాడిన బాలుకి తాను గాత్ర దానం చేయడం తన పూర్వజన్మ సుకృతం అని అంటున్నాడు.
ఇదే సందర్భంలో మరొక విషయం బాలు గురించి చెప్పుకోవాలి ‘దశావతారం’ కమలహాసన్ నటించిన 10 పాత్రలకు తమిళ వెర్షన్ లో డబ్బింగ్ చెప్పడానికి విలక్షణ నటుడు కమలహాసన్ కు 8 రోజులు పడితే ఆ మూవీ తెలుగు వెర్షన్ లోని కమలహాసన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పడానికి బాలుకి కేవలం 3 రోజులు మాత్రమే పట్టిందట. ఏ మనిషి అయినా పని చేయకుండా ఖాళీగా ఉంటే తుప్పుపట్టిపోతారు అని తరుచు చెప్పే బాలు తనకు కరోనా సోకి హాస్పటల్ కు వెళుతున్న సమయంలో కూడ ఒక పాటను పాడుకుంటూ హాస్పటల్ కు వెళ్ళారు అంటే అలాంటి గాన గంధర్వుడు గాత్రంతో ఇక దేవతలు ఉండే స్వర్గం కూడ పులకరించి పోతుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి