స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తే డైరెక్టర్ల కెరీర్‌ మారిపోతుంది. టాప్‌ లీగ్‌లో దూసుకెళ్తారు. కానీ సుజిత్‌ మాత్రం పెద్ద హీరోలతో పెట్టుకుని ప్రాబ్లమ్స్‌లో పడిపోయాడు. పాన్‌ ఇండియన్‌ సినిమాతో మొదలైన కష్టాలు, మెగా ప్రాజెక్ట్‌తో మరింత ఎక్కువయ్యాయి. సుజిత్‌ కెరీర్‌ని క్వశ్చన్‌ మార్క్‌లో పడేశాయి.

సుజిత్‌కి రెండో సినిమాతోనే స్టార్ డైరెక్టర్‌లా మారే చాన్స్ వచ్చింది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌తో 'సాహో' సినిమా తీశాడు. పాన్‌ ఇండియన్‌ లెవల్లో వచ్చిన ఈ మూవీతో సుజిత్‌ కెరీర్‌ మరో స్టేజ్‌కి వెళ్తుందని ఇండస్ట్రీ జనాలు కూడా ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ రిజల్ట్‌ మాత్రం రివర్స్ అయ్యింది. సుజిత్‌ ప్రభాస్‌ ఇమేజ్‌ని హ్యాండిల్ చెయ్యలేకపోయాడనే కామెంట్స్ వచ్చాయి.

'సాహో'కి మిక్స్‌డ్ రిజల్ట్ వచ్చాక సుజిత్‌ కొంచెం స్లో అయినట్లు కనిపించాడు. అయితే ఈ టైమ్‌లోనే చిరంజీవిని డైరెక్ట్‌ చేసే అవకాశమొచ్చింది. సుజిత్‌కి 'లూసిఫర్' రీమేక్‌ బాధ్యతలు అప్పగించాడు చిరు. ఇక ఈ మెగాప్రాజెక్ట్‌తో సుజిత్‌కి క్రేజీ ఆఫర్‌ వచ్చిందనే ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో ఈ ప్రాజెక్ట్‌ నుంచి బయటకు వచ్చేశాడు సుజిత్.

ప్రభాస్‌ సినిమాకి నెగటివ్ రిజల్ట్ రావడం, చిరంజీవి సినిమా మిస్‌ అవడంతో సుజిత్‌పై ప్రెజర్‌ పెరిగిపోతోంది. భారీ ఆఫర్స్‌ని హ్యాండిల్ చెయ్యలేకపోతున్నాడనే కామెంట్స్‌కి సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లో పడిపోయాడు. సో ఈ కామెంట్స్‌ నుంచి తప్పించుకోవాలంటే సుజిత్‌ నెక్ట్స్ ఒక సూపర్ హిట్‌ రిలీజ్‌ చెయ్యాలి. మరి సుజిత్‌ ఏం చేస్తాడో చూడాలి.

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు చేస్తే.. డైరెక్టర్ల ఇమేజ్ మరింత పెరిగిపోతుంది. పైగా ఆ డైరెక్టర్ టాలెంట్ చూపించి హీరోలను తగిన విధంగా ఎస్టాబ్లిష్ చేస్తే.. బ్లాక్ బస్టర్ అవుతుంది. అయితే సుజిత్ మాత్రం స్టార్ హీరోలతో సినిమాలు చేసి సరైన క్రేజ్ సంపాదించుకోలేకపోయాడు. అంతేకాదు కొందరు స్టార్ హీరోలు కూడా ఆ డైరెక్టర్ పై ఇప్పటికీ ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు.








మరింత సమాచారం తెలుసుకోండి: