సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎప్పటికప్పుడు ఫేడ్ అవుట్ అయి పోతూ ఉంటారు. హీరోయిన్స్ కొన్నాళ్ల పాటు మాత్రమే స్క్రీన్ స్పేస్ కలిగి ఉంటారు. కాంబినేషన్స్ గనుక సక్సెస్ అయితే మరి కొన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో ఉండే అవకాశం ఉంటుంది. లేదా ఒకప్పుడు హీరోగా చేసిన వారితోనే క్యారెక్టర్ రోల్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే చాలా వరకు హీరోయిన్స్ తమ మార్కెట్ తగ్గింది అని భావించిన వెంటనే పెళ్లి చేసుకుని సైడ్ అయిపోతూ ఉంటారు. ఆ విషయం పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో జనాలు ఎక్కువగా నమ్మేది  సెంటిమెంట్. 

అయితే ఇప్పుడు కాస్త ట్రెండ్ మారింది అని చెప్పాలి. ఎందుకంటే సెంటిమెంట్ అనే విషయం పక్కన పెట్టి జనాల్లో క్రేజ్ వున్న వారిని తీసుకోవడానికి ఇష్ట పడుతున్నారు. ఆ కోవలోనే బెంగుళూరు బ్యూటీ కృతి శెట్టికి వరుస అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఈ భామ హీరోయిన్ గా ఉప్పెన అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయితే కాలేదు. కానీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. 

అయితే ఈ సినిమాలో ఆమె నటన గురించి ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆమె టాలెంట్ చూసి చాలామంది కుర్ర హీరోలు ఆమెను తమ పక్కన నటింపజేయాలని దర్శకులను కోరుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ భామకు తెలుగులో రెండు పెద్ద ప్రాజెక్టులు దక్కాయని అంటున్నారు. అయితే ఏమీ దక్కించుకుంది అనే విషయం మీద క్లారిటీ లేకపోయినా ఎక్కువగా కుర్ర హీరోలు తమ సినిమాల్లో ఈమెను నటింప చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని మాత్రం అంటున్నారు. చూడాలి ఈ భామ భవిష్యత్తులో ఇంకెన్ని మంచి అవకాశాలు దక్కించుకుంటుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: