ఇక లవర్ బాయ్ నాగచైతన్య తో చేస్తున్న లవ్ స్టోరీ సినిమాతో సాయిపల్లవి కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.సారంగదరియా పాట వల్ల లవ్ స్టోరీ సినిమాపై అంచనాలు పెరగగా లవ్ స్టోరీ సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని శేఖర్ కమ్ముల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ముల వైష్ణవ్ తేజ్, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రియాంక అరుళ్ మోహన్ ఇప్పటికే నాని గ్యాంగ్ లీడర్, శ్రీకారం సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా ఈ సినిమాలు సక్సెస్ కాలేదు. అందం, అభినయం ఉన్న ప్రియాంక నటించబోయే సినిమాలు సక్సెస్ అయితే ఆమెకు స్టార్ హీరోయిన్ గా కూడా గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది.శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్లకు ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు. ప్రియాంక అరుళ్ మోహన్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో నటిస్తే మాత్రం ఆమె జాతకం ఖచ్చితంగా మారుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి