పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుదీర్ఘమైన విరామం తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో ఏప్రిల్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఇటీవలే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని యుఎ(UA) సర్టిఫికెట్ సంపాదించింది. అయితే ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 35 నిమిషాలు ఉంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ఒరిజినల్ పింక్ సినిమా రన్ టైమ్ 2 గంటల 10 నిమిషాలు మాత్రమే ఉంది. అయితే ఒరిజినల్ సినిమాలోని మెయిన్ పాయింట్ అస్సలు మిస్ కాకుండా దర్శకుడు వేణు శ్రీరామ్ చాలా జాగ్రత్త పడ్డారు. కానీ రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ చిత్రం ఒరిజినల్ సినిమా లెంత్ కంటే 25 నిమిషాలు ఎక్కువగా ఉంది. దీనికి కారణం పవన్ కల్యాణ్, శృతిహాసన్ కోసం ప్రత్యేకంగా ఒక లవ్ ట్రాక్ రూపొందించడమే అని చెప్పుకోవచ్చు.


అయితే మిస్టరీ జానర్ లో 2 గంటలకు మించి రన్ టైమ్ ఉంటే సినిమా సాగదీసినట్లు అనిపిస్తుంది. మరి రెండున్నర గంటలకు పైగా సాగే ఈ సినిమాని ప్రతి ప్రేక్షకుడు లీనమయ్యేలా వేణు శ్రీరామ్ తీసారా లేదా అనేది తెలియాల్సివుంది. అదనంగా రూపొందించిన 25 నిమిషాల పవన్ కల్యాణ్ లవ్ ట్రాక్ సినిమా టోటల్ అవుట్‌పుట్‌ పై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. ఒక వైపు సీరియస్ డ్రామా నడిపిస్తూనే మరోవైపు రొమాంటిక్ డ్రామా నడిపించడం కత్తి మీద సాము లాంటిదే. మొత్తం మీద పవన్ కల్యాణ్ సినిమా ఏ స్థాయిలో హిట్ అవుతుందో తెలియాలంటే ఇంకో మూడు రోజులు ఆగాల్సిందే.


ఇదిలా ఉండగా.. వకీల్ సాబ్ చిత్రం బృందం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే ప్రత్యేక ప్రదర్శనలు థియేటర్లలో వేసేందుకు అనుమతి పొందింది. హైదరాబాద్ లో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ షోలు వెయ్యకపోవచ్చని తెలుస్తోంది. అయితే కరోనా వైరస్ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడకపోతే.. వకీల్ సాబ్ చిత్రం ఈజీగా చాలా కోట్ల రూపాయల లాభాలను తెచ్చి పెట్టడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: