అల్లు అర్జున్, దేవి శ్రీ
ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన పాటలు ఏ స్థాయిలో హిట్టవుతాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
సన్నాఫ్ సత్యమూర్తి,
ఆర్య,
ఆర్య 2, దువ్వాడ జగన్నాథం,
జులాయి సినిమాల్లోని దాదాపు అన్ని పాటలు సూపర్ హిట్స్ అయిన విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ పాటలు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు భారత దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి.
దీనిపై
దేవిశ్రీప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పెదవి విప్పారు. ఆయన మాట్లాడుతూ.. "యూట్యూబ్ లో విడుదలైన సీటీమార్ రీమిక్స్ పాట 3 నిమిషాలే ఉంది కానీ సినిమాలో ఆ పాట 4 నిమిషాల 30 సెకన్లు ఉంటుంది. మిగిలిన ఆ 1 నిమిషం 30 సెకండ్ల పాటలో
సల్మాన్ ఖాన్ చాలా అద్భుతంగా డాన్స్ స్టెప్పులు వేశారు. సినిమాలో ఒక హూడీ స్టెప్ ఉంటుంది.. ఆ స్టెప్ ని దిశ,
సల్మాన్ కలిసి అదరగొట్టేసారు. అది బెస్ట్ డాన్స్ స్టెప్ ఆఫ్ ది ఇయర్ అవుతుందని నేను కచ్చితంగా చెప్పగలను.... "
"టెర్రిఫిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. దానికి తగ్గ డాన్స్ స్టెప్పులు ప్రేక్షకులను
ఫిదా చేయడం ఖాయం. నేను చిత్రం షూటింగ్ ని ప్రత్యక్షంగా చూశాను.
సల్మాన్ హూడీ స్టెప్ కి సంబంధించిన పోర్షన్ వెండితెరపై చూసేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ ఇవ్వాలని
సల్మాన్ ఖాన్ అద్భుతమైన డాన్స్ స్టెప్స్ ని కావాలనే చిత్ర యూనిట్ దాచిపెట్టి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ స్టెప్స్ తో రాధే సినిమాలో
బన్నీ కి పోటాపోటీగా
సల్మాన్ డాన్స్ వేశారని ప్రేక్షకులు కచ్చితంగా ఒప్పుకుంటారు" అని ఆయన చెప్పుకొచ్చారు.