
ఇక ఇటీవల వచ్చిన చాణక్య యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకుంది. అనంతరం కొంత ఆలోచన చేసిన గోపీచంద్ ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో సీటిమార్ మూవీ తో పాటు మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే మూవీ కూడా చేస్తున్నారు. కాగా వీటిలో ఇప్పటికే సీటిమార్ షూటింగ్ మొత్తం పూర్తి అయి త్వరలో విడుదలకు సిద్ధం కాగా, పక్కా కమర్షియల్ మూవీ మాత్రం కొంతమేర షూట్ జరుపుకుంది. డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో కమర్షియల్ జానర్స్ లో సినిమాలు తీసే మారుతి ఈ సినిమాలో గోపీచంద్ ని ఒక పక్కా కమర్షియల్ లాయర్ పాత్రలో చూపించనున్నట్లు తెలుస్తోంది.
యువి క్రియేషన్స్, గీత ఆర్ట్స్ 2 సంస్థలపై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా జెక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఈ మూవీని దర్శకడు మారుతీ ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇక రేపు గోపీచంద్ బర్త్ డే సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది యూనిట్. ఆ పోస్టర్ లో గోపీచంద్ స్టైలిష్ లుక్ లో నిలబడి ఉండడం గమనించవచ్చు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. కాగా ఈ కరోనా పరిస్థితులు సర్దుమణిగిన అనంతరం తమ పక్కా కమర్షియల్ మూవీ షూటింగ్ వెంటనే ప్రారంభించి సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేస్తాం అని అంటున్నారు నిర్మాత బన్నీ వాసు ..... !!