‘బాహుబలి’ సినిమా చూసిన ప్రేక్షకులు కట్టప్ప పాత్రను తమ జీవితంలో మర్చిపోరు. దీనికితోడు ఆ పాత్రలో లీనమై నటించిన తమిళ నటుడు సత్యరాజ్ పేరు తెలుగు ప్రజలందరికీ కనెక్ట్ అయింది. వాస్తవానికి సత్యరాజ్ తమిళ సినిమాలలో హీరో సుమారు 100 సినిమాలకు పైన హీరోగా చేసిన సత్యరాజ్ ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు.

డబ్బింగ్ సినిమాలు చూసే వారికి సత్యరాజ్ పేరు సుపరిచితం. ‘మిర్చి’ సినిమాతో తెలుగు సినిమాలలో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన సత్యరాజ్ కట్టప్ప పాత్ర ద్వారా నేషనల్ ఫిగర్ గా మారిపోయాడు. అయితే ఆ పేరుకు తగ్గట్టుగా సత్యరాజ్ కు తెలుగు సినిమాలలో ఎందుకు అవకాశాలు ఎక్కువగా రాలేదు అన్న ప్రశ్న చాలామందిలో ఉంది.

‘జెర్సీ’ మూవీలో సత్యరాజ్ కీలక పాత్రను పోషించాడు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతిరోజు పండుగే’ మూవీ కథలోని రఘురామయ్య పాత్ర చుట్టూ ఆమూవీ తిరగడమే కాకుండా ఆమూవీ ఘనవిజయంలో సత్యరాజ్ నటన అందరి ప్రశంసలు అందుకుంది. అయితే ఈ మూవీ తరువాత కూడ సత్యరాజ్ కు చెప్పుకోతగ్గ పాత్రలు మన దర్శకులు క్రియేట్ చేయలేకపోవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది.

కరోనా పరిస్థితులు గత సంవత్సర కాలంగా కొనాసాగుతున్నప్పటికీ అనేక భారీ మీడియం రేంజ్ సినిమాల నిర్మాణం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఏ భారీ మూవీలోను సత్యరాజ్ నటించడం లేదు. ప్రస్తుతం ఈ విలక్షణ నటుడు మారుతి దర్శకత్వంలో నిర్మాణం జరుపుకుంటున్న ‘పక్కా కమర్షియల్’ మూవీలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈమూవీ తప్ప ప్రస్తుతం సత్యరాజ్ తెలుగులో నటిస్తున్న మరి ఏ సినిమా షూటింగ్ దశలో లేవు. దీనితో ఈ విలక్షణ నటుడుని మన దర్శక నిర్మాతలు ఎందుకు సైడ్ లైన్ చేస్తున్నారు అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో కలుగుతున్నాయి. అయితే తమిళ సినిమా రంగంలో మటుకు ప్రస్తుతం సత్యరాజ్ చాల బిజీ ఆర్టిస్ట్. దీనితో ఇతని డేట్స్ సమస్యవల్ల అవకాశాలు ఇచ్చే అవకాశం మన దర్శకులకు అవకాశాలు లేకుండా పోయి ఉంటుంది అన్న అంచనాలు వస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: