బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తన మొట్టమొదటి సినిమా "హృదయ కాలేయం" తో భారీ హిట్ అందుకున్నారు. ఈ సినిమాలోని సన్నివేశాలు నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యాయి. చాలామంది విదేశీయులు కూడా ఈ సినిమాలోని సన్నివేశాలు చూసి కడుపుబ్బా నవ్వుకున్నారు. ఆ స్థాయిలో అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకున్న సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’ సినిమాతో కూడా సినీ ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు.
అయితే ఇప్పుడు ఆయన ‘క్యాలీఫ్లవర్’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ‘క్యాలీఫ్లవర్’ అనే కామెడీ ఎంటర్టైనర్ లో ఆయన హీరోగా, ఆయన సరసన వసంతి హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా, ‘శీలో రక్షతి రక్షితః’ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రానికి గోపీకిరణ్ కథ అందించగా.. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయిందని మూవీ యూనిట్ తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసి వెల్లడించింది.
ఈ పోస్టర్ లో సంపూర్ణేష్ బాబు శ్రీ రాముని అవతారం లో కనిపించి ఆశ్చర్యపరిచారు. ఇదే పోస్టర్ లో సంపూర్ణేష్ బాబు పెద్ద ధనుస్సు పట్టుకొని.. బాణానికి బదులుగా స్కేల్ ని ఎక్కుపెట్టడం కూడా చూడొచ్చు. మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ బ్యానర్స్ పై నిర్మాత ఆశ జ్యోతి గోగినేని ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు ఇంగ్లాండ్ నుండి ఇండియాకు వచ్చిన ఇంగ్లీష్ మ్యాన్ గా కనిపించనున్నారు. సంపూర్ణేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ బ్యాంగ్ వీడియో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఫస్ట్ లుక్ కూడా సినిమాపై అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమాకి ప్రజ్వల్ క్రిష్ సంగీతం బాణీలు సమకూరుస్తున్నారు. సంపూర్ణేష్ బాబు కాలీఫ్లవర్ తో పాటు బజార్ రౌడీ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు.