ప్రత్యేక ఆకర్షణ కానున్ననటి సమంత  'ది ఫ్యామిలీ మ్యాన్'

ఓటిటి ఫ్లాట్ ఫాంలో చిత్రాలు చూసే వారికి ఇది నిజంగా శుభవార్తే. ఈ ఏడాది గోవాలో జరగనున్న అంతర్జాతీయ సినిమా పండుగ ( ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ - ఇఫి) లో ఓటిటి కి అధిక ప్రాధాన్యం లభించ నుంది. ఈ విషయాన్ని ఇఫీ వర్గాలు ప్రకటించాయి. నెట్తఫ్లిక్స్, అమెజాన్ ప్రైం, సోనీ లైం, జీ5 లాంటి ఓటిటి సంస్థలు ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించనున్నాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం నెట్ ఫ్లిక్స్ ప్యారిస్ కు చెందిన సినీరంగ ప్రముఖుడు గోబెలిన్ ప్రసంగ పాఠాలను ప్రసారం చేయనుంది. అంతే కాక ఇండియన్ ప్రీమియర్ విభాగంలో 'ది పవర్ ఆఫ్ ది డాగ్' ను ప్రసారం చేయనుంది. జేన్ కాంపియన్ నిర్మించిన ఈ చిత్రం 78వ వెనీసీ చిత్రోత్సవం వరల్డ్ ప్రీమియర్ విభాగంలో అవార్డులను గెల్చుకుంది. రవీనాటాండన్ నటించిన క్రైం సినీస్ ఆరనీయ్ ను కూడా ఇక్కడ ప్రదర్శించనున్నారు.
అమెజాన్ ప్రైం కూడా సత్యజిత్ రే చిత్రాలను ప్రసారం చేసేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక దక్షిణ భారతీయ సినిమారంగానికి చిరపరిచితురాలైన నటి సమంత,  మనోజ్ నంటించిన వెబ్ సిరీస్  'ది ఫ్యామిలీ మ్యాన్'  చలనచిత్రోత్సవం ప్రారంభంలో ప్రదర్శించ నున్నారు. సోని లైవ్ 1992 నుంచి వచ్చిన ఆణిముత్యాలను  ప్రసారం చేయనున్నట్లు సమాచారం. జీ-5  విషయానికి వస్తే ప్రఖ్యాత దర్శకులు  నితిష్ తివారి, ఖురానా, ఓం ప్రకాశ్ మెహరాల  చర్చలను ప్రసారం చేయనుంది.
కరోనా మహమ్మారి విశ్వ రూపం కారణంగా చాలా మంది థియేటర్లకు వెళ్లి సినిమాలు  చూడలేకపోయారు. వారికి వినోదం దూరమైంది. ఈ  గ్యాప్ ను ఓటిటి పూర్తి చేసిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్  తెలిపారు.
ఈ చిత్రోత్సవంలో స్పానిష్ చిత్రం 'ది కింగ్ ఆఫ్ ఆల్ ది వరల్డ్' ను ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనున్నారు. ఈ చిత్రోత్సవం నాటి తరం జేమ్స్ బాండ్ నటుడు సీన్ కెనరీకి నివాళులర్పించనుంది. అంతే కాకుండా భారత  దేశం స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని  75  మంది ప్రముఖలు యవ కళాకారులకు ప్రత్యక శిక్షణ ఇవ్వనన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: