లక్షలాది మంది అభిమానుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న శాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటురావడంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.కన్నడ నాట ఆల్రౌండర్ యాక్టర్ గా పునీత్ సంపాదించిన పేరు, క్రేజ్ ఇంకా ఆయన సొంతం చేసుకున్న ఫ్యాన్స్ అంతా ఇంత కాదు. కొన్ని లక్షల మంది అభిమానులు పునీత్ రాజ్ కుమార్ సొంతం.దివంగత లెజండరీ హీరో రాజ్ కుమార్ గారి ముద్దుల వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన పునీత్ తన తండ్రి లాగానే కన్నడ నాట విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.ఇక పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త విని సినీ ప్రేమికులంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్న వయసులోనే ఎంతో పేరుసంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ హఠాత్మరణంతో టాలీవుడ్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇక పునీత్ రాజ్ కుమార్ మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే..ఇక ఆయన మరణంతో టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నందమూరి బాలకృష్ణ, రానా, ఎన్టీఆర్ , చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్ , అలీ ఇలా పలువురు నటులు ఆయన నివాసం వద్దకు వెళ్లి పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.ఇక తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఇక ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఆయన చనిపోయాక సొంత కుటుంబ సభ్యులే దూరమైనట్టు ఉంది. ఆయన చని పోయారంటే నేను ఇప్పటికీ అసలు నమ్మలేకపోతున్నా.. అంటూ మెగా పవర్ స్టార్ బాగా ఎమోషనల్ అయ్యారు . పునీత్ రాజ్ కుమార్ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా అని అన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: