టాలీవుడ్ సినిమా పరిశ్రమకు తారాజువ్వ లా వచ్చి అమాంతం ప్రేక్షకుల చూపును తిప్పుకోనివ్వకుండా చేసుకుంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన ఈ హీరో అర్జున్ రెడ్డితో సృష్టించిన సెన్సేషన్ ఇంకా తగ్గలేదు. ఇప్పటికీ అర్జున్ రెడ్డి సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు అంటే అది ఏ లెవెల్లో సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా వల్ల విజయ్ దేవరకొండ కు వచ్చిన పేరు పది సినిమాలకు చేస్తే వచ్చే పేరు తో సమానం. ఏది ఏమైనా ఈ సినిమాతో టాలీవుడ్ కు ఓ కొత్త స్టార్ పుట్టుకొచ్చడు అనే చెప్పాలి. 

సినిమాలు చేయడం మాత్రమే కాదు తన ఆటిట్యూడ్ తో కూడా భారీ అభిమానాన్ని సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా చేసిన వెంటనే గీత గోవిందం లాంటి క్లాసికల్ సినిమా చేసి మళ్ళీ అందరి మనసులను దోచుకున్నాడు. ఆ విధంగా విజయ్ దేవరకొండ గీత గోవిందం తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ ఇంతవరకు అందుకోలేదని చెప్పాలి. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా వర్కౌట్ కాలేదు. కథా పరంగా సినిమాలు బాగానే ఉన్నా కూడా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. 

దాంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న  లైగర్ సినిమా పై అంచనాలు పెట్టుకున్నారు అందరు. విజయ్ దేవరకొండ ఫ్యూచర్ స్టార్ డమ్ కూడా దీనిపై ఆధారపడి ఉండడంతో ఆయన కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ సినిమాపై. ఇదిలా ఉంటే ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తున్నారు విజయ్ దేవరకొండ. ఇప్పటివరకు ఎన్నో బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విజయ్ దేవరకొండ తాజాగా మహేష్ బాబు ను రీప్లేస్ చేశారని తెలుస్తుంది. మహేష్ బాబు థమ్స్ అప్ యాడ్ ను ఇప్పుడు విజయ్ చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మహేష్ చేస్తున్న ఈ యాడ్ ను విజయ్ దేవరకొండ చేజి క్కించుకోవడం ఆయన స్టార్ డం ను తెలియజేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: