బాలీవుడ్
హీరోయిన్ అలియా భట్ తెలుగులో
హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు
ఆర్ఆర్ఆర్ సినిమాతో రాబోతుంది.
బాలీవుడ్ లో కూడా ఆమె ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించే
హీరోయిన్ గా అవతరించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవైపు నేపొటిజం ఇంకోవైపు కొత్త హీరోయిన్ల తాకిడి తో ఆమె ఏమాత్రం బెదిరి పోలేదు. తన టాలెంట్ ను నమ్ముకొని సినిమాలను చేస్తూ ముందుకు వెళుతూనే ఉంది. ఆమె ఎదుగుదల చూసిన తరువాత మిగతా హీరోయిన్లు కూడా ఆమె లా సినిమాలు చేయాలని భావిస్తున్నారు.
తాజాగా గంగుభాయ్ కథియావాడ సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు రాగా అది
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో
బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఆమెకు మంచి ఇమేజ్ ను తీసుకు వచ్చింది అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఆమెకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను కూడా రెట్టింపు చేసింది ఈ సినిమా. ఇక ఇది ఇంత పెద్ద హిట్ అయింది అంటే దాని క్రెడిట్ మొత్తం కూడా ఈ
అమ్మాయి కి వస్తుంది. అలా గ్లామర్ పాత్రలనే కాదు మంచి మంచి
సినిమా పాత్ర లు ఛాలెంజింగ్ పాత్రలు కూడా చేయగలదు అని ఇక్కడ నిరూపించుకుంది.
మహేష్ భట్ వారసురాలు గా ఎంట్రీ ఇచ్చినా కూడా ఇప్పుడు తన ప్రత్యేకమైన ఐడెంటిటీని ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకు పోతుంది. మొదట ఆమే బరువైన పాత్రలు చేయలేదనే చర్చ కొనసాగింది. అలా గంగుబాయి రూపంలో దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ చూసి ఆమెకు 20 కోట్ల పారితోషికం ఇచ్చి
సినిమా చేశాడు. ఆ విధంగా ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకున్న
హీరోయిన్ గా ఆమె అవతరించింది. ఇప్పటి వరకు
బాలీవుడ్ హీరోయిన్లకు చాలా మందికి పది కోట్లకు మించి కానీ ఇవ్వలేదు.
ప్రియాంక చోప్రా
దీపికా పడుకొనే కరీనా కపూర్ లాంటి వారికి కూడా 10 కోట్లకు మించలేదు. కానీ
ఆలియా ఈ విధమైన పారితోషకం తీసుకోవడం విశేషం. దీంతో
ఆలియా తోటి హీరోయిన్లు ఆమెను చూసి కుల్లుకుంటున్నారట.