నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ బాల గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈయన తమిళ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు.అయితే ఆయన సినిమాలు చిత్ర ఎమోషనల్ కంటెంట్ తో విలక్షణంగా ఉంటాయి.ఇక దీనికి గాను విభిన్నమైన దర్శకుడిగా గుర్తింపు పొందారు. కాగా తాజాగా ఈయన పర్సనల్ లైఫ్ లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ బాల తన భార్య ముధుమలార్ తో విడిపోతూ విడాకులు తీసుకున్నారు. ఇక ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో ఈ వార్త సంచలనంగా మారింది.ఇక ఇదిలా వుండగా  ఇటీవల చిత్ర పరిశ్రమలో విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

తెలుగులో సమంత, చైతు.. కొన్ని రోజుల క్రితం ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బాల, మధుమలార్ డివోర్స్ తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.అంతేకాకుండా బాల, ముధుమలార్ మధ్య నాలుగేళ్ళ క్రితమే విభేదాలు మొదలయ్యాయట. అయితే అప్పటి నుంచే వీరిద్దరూ విడిగానే ఉంటున్నారట. అయితే ఆ తర్వాత ఫ్యామిలీ కోర్టు లో ఇద్దరూ విడాకులకు అప్లై చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా వీరిద్దరూ అధికారికంగా విడిపోయారు. అయితే వీరిద్దరి వివాహానికి గానూ ఒక కుమార్తె కూడా ఉంది.

ఇక ఇదిలా ఉంటే వీరిద్దరి విడాకులకి అసలు కారణం ఏంటి అనేది మాత్రం తెలియలేదు.కాగా ఈ ఇద్దరూ 2004లో మధురైలో వివాహం చేసుకున్నారు.కాగా  దాదాపు 17 ఏళ్ల పాటు సాగిన వీరి వివాహ బంధానికి నేటితో తెరపడింది.అయితే బాల తెరకెక్కించే చిత్రాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటాయి. ఇక ఇదిలా ఉండగా సూర్య, విక్రమ్ కలసి నటించిన శివ పుత్రుడు చిత్రం సంచలనం సృష్టించింది. అంతేకాకుండా ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. దెంతోపాటు అలాగే 2008లో బాల 'నాన్ కాదవుల్' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ విషయం ఇలా ఉంటే  బాల తదుపరి చిత్రం హీరో సూర్యతో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: