ఇప్పటివరకు ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇక మరింత ఆలస్యం చేయకుండా ఇంకొక అప్డేట్స్ ఇచ్చేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ఈ చిత్రం నుండి ఫస్ట్ ఎటాక్ ను ఈనెల 30వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు గా ఒక పోస్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే చిత్రబృందం ఫస్ట్ ఎటాక్ అంటూ తెలపడంతో ఇప్పుడు ఫస్ట్ ఎటాక్ అంటే ఏమి ఉంటుందని అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ సినిమాకు సంబంధించి నితిన్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ పోస్టర్ ను చూస్తే మాత్రం ఏదో యాక్షన్ సన్నివేశాన్ని చూపించబోతున్నారు అన్నట్లుగా తెలుస్తున్నది. అయితే ఈ సినిమా ప్రచారం మొదటినుంచి చాలా విభిన్నంగా నే చేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఏదైనా ప్రయోగాత్మకంగా వీడియోను విడుదల చేయబోతున్నారని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా కు సంబంధించి ప్రమోషన్ పనులను కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అది కూడా చాలా విభిన్నంగానే ఈ చిత్ర ప్రమోషన్ మొదలుపెట్టారు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ సినిమాని నితిన్ ను గట్టెక్కి స్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి