బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి హీరోగా అభిషేక్ బచ్చన్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును  ఏర్పరుచుకున్నాడు,వ అభిషేక్ బచ్చన్ ఇప్పటి వరకు నేరుగా ఒక్క తెలుగు సినిమాల్లో కూడా  నటించకపోయినప్పటికీ హిందీలో నటించిన సినిమాల ద్వారానే అభిషేక్ బచ్చన్ తెలుగులో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.   ఇది ఇలా ఉంటే గత రెండు సంవత్సరాలుగా అభిషేక్‌ బచ్చన్‌ ఒక వెబ్‌ సిరీస్‌, నాలుగు మూవీ లలో నటించాడు,  ఇవన్ని 'ఓ టి టి'  లోనే విడుదల అయ్యాయి,  ఇది ఇలా ఉంటే అభిషేక్‌ బచ్చన్ తన నటనతో మెప్పించిన ఆ వెబ్ సిరీస్‌, సినిమాలేంటో చూద్దాం...

దస్వీ : అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో యామీ గౌతమ్‌, నిమ్రత్ కౌర్‌ ముఖ్యమైన పాత్రల్లో నటించారు, ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ తన నటనతో ప్రేక్షకులను అలరించాడు,  ఈ సినిమా ఏప్రిల్‌ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌, జియో సినిమాలలో స్ట్రీమింగ్‌ అవుతోంది.


బాబ్‌ బిస్వాస్‌ : అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా జీ ఫైవ్ లో డిసెంబర్‌ 3, 2021 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.


ది బిగ్ బుల్‌ : అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 8, 2021 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది, ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ తన నటనతో ప్రేక్షకులను అలరించాడు.


లూడో : అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ తన నటనతో ప్రేక్షకులను అలరించాడు, ఈ మూవీ నవంబర్‌ 12, 2020 నుండి ప్రముఖ 'ఓ టి టి' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.


బ్రీత్‌: ఇన్‌టు ది షాడోస్‌ : అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ జూలై 10, 2020 నుండి  అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: