సినీ పరిశ్రమకి, రాజకీయ రంగానికి మద్య ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండో వారది నడుస్తూనే ఉంది. స్టార్ సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులకు మద్దతుగా నిలబడటం, మరికొందరు నేరుగా రాజకీయ నాయకులుగా మారడం వంటివి చాలానే చూసాం. సినీ నటులు ఎందరో రాజకీయ నేతలకు మద్దతు పలుకుతున్నారు. కాగా సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ సైతం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన వారే. అలా సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి మధ్య అనుభందం ఉంది. అంతేకాదు భరత్ అనే చిత్రం కూడా వైసిపి పార్టీకి ఒకరకంగా ఊతం ఇచ్చిందనే చెప్పాలి. ఆ సినిమాలో భరత్ అనే నేను అని మహేష్ బాబు చేసే ప్రమాణ స్వీకారం ను వైయస్ జగన్ కు అన్నారే తప్ప మారే నాయకుడి కి చెప్పలేదు. ప్రజల్లోనూ ఇదే భావన వుంది.

అయితే మహేష్ బాబు మాత్రం ఎపుడు కూడా పెద్దగా రాజకీయాల వైపు చూసింది లేదు. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో వినిపిస్తున్న మాట ఏమిటంటే ..!!! ఈసారి ఎలక్షన్స్ కి వైసిపికి మద్దతుగా నిలవబోతున్నారు అన్నది వినిపిస్తున్న మాట. ప్రస్తుతం అధికార పార్టీ పై ప్రతిపక్ష పార్టీ నేతలే కాదు ప్రజలు కూడా ఒకింత గుర్రుగా ఉన్నారనే చెప్పాలి. అభివృద్ధి అన్నదే కనపడటం లేదని, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారు అని చాలానే విమర్శలు ఉన్నాయి. అయితే ఈసారి  ఎలక్షన్స్ లో మళ్ళీ అధికారం లోకి రావడానికి కొందరు సినీ పరిశ్రమ పెద్దల మద్దతు కూడా తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.  మహేష్ ఏమనుకుంటున్నారు అనేది తెలియదు  కానీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే వైసిపి పార్టీకి ఫుల్ గా కనెక్ట్ అయిపోయారు.

సోషల్ మీడియాలో అయితే భరత్ అనే నేను -  జగన్ అనే నేను అంటూ వీడియోలు హోరెత్తడమే అందుకు నిదర్శనం. సూపర్ స్టార్ అభిమానులంతా వైసీపీకి కనెక్ట్ అయిపోయారు అనడానికి ఇలా చాలానే ఉన్నాయి. ఇదిలా ఉంటే  ‘సర్కారు వారి పాట’ మూవీ బాధ్యతని పూర్తిగా వైసీపీ మద్దతుదారులు తమ భుజానికెత్తుకోవడమే మరొక విశేషం. తెలంగాణలో వైసీపీ పార్టీ లేదు కానీ, వైఎస్ జగన్ కు భారీ ఎత్తున అభిమానులున్నారు. వాళ్ళంతా కలిసి ‘సర్కారు వారి పాట’ చిత్రానికి అండగా నిలిచి తమ ప్రేమను కనబరిచారు. అయితే తెలుగుదేశం, జనసేన కలిసి మహేష్ చిత్రం పై కుట్ర పన్ని సిఎం జగన్ ను కలిసినందుకే...ఇలా సినిమా బాగోలేదు అంటూ  నెగిటివ్ టాక్ ను ప్రచారం చేశారన్నది  వైసీపీ ఆరోపణ. ఇవన్నీ అటుంచితే వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండే మహేష్ అధికార పార్టీకి మద్దతు పలకడానికి సిద్దం అవుతున్నారన్నది వినిపిస్తున్న వార్త. మరి ఇంతకీ ఏమౌతుంది అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: