పవన్ క్రిష్ ల కాంబినేషన్ లో మొదలైన ‘హరి హర వీరమల్లు’ ప్రస్తుతం ఏకంగా పవర్ స్టార్ ను కన్ఫ్యూజ్ చేస్తోందా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీకి సంబంధించిన మరొక షెడ్యూల్ ఈనెల 12న ప్రారంభించవలసి ఉంది. అయితే ఆ షెడ్యూల్ ప్రారంభం కాలేదు అంటున్నారు.దీనికికారణం ఈ మూవీ షెడ్యూల్ కోసం వేసిన రెండు భారీ సెట్స్ పవన్ కు ఏమాత్రం నచ్చలేదని అంతేకాకుండా ఈమూవీ లేటెస్ట్ షెడ్యూల్ కోసం తయారు చేసిన కాస్ట్యూమ్స్ పట్ల కూడ పవన్ తన అసంతృప్తి క్రిష్ దగ్గర వ్యక్త పరిచాడు అనే గుసగుసలు కూడ వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం నుండి ఎదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది.ఈమూవీ ప్రారంభం అయిన తరువాత పవన్ నటించిన ‘భీమ్లా నాయక్’ కూడ విడుదల అయిపోయింది. ఇప్పుడు ఈమూవీకి రకరకాల కారణాలు అడ్డు తగులుతున్నాయి అంటున్నారు. ఈమధ్య తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వాతావరణం వేడెక్కిపోవడంతో పవన్ దృష్టి అటువైపు మళ్ళీ ‘భీమ్లా నాయక్’ పట్ల ఎక్కువ శ్రద్ధ కనపరచలేకపోతున్నాడు అన్న వార్తలు కూడ ఉన్నాయి.దీనికితోడు ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు షూట్ చేసిన అవుట్ పుట్ ను చూసిన పవన్ క్రిష్ వద్ద తన అసంతృప్తిని వ్యక్త పరిచినట్లు కూడ గాసిప్పులు వస్తున్నాయి. దీనితో ఈ మూవీ దసరా కు కాదు కదా కనీసం సంక్రాంతికి అయినా విడుదల అవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా హరీష్ శంకర్ సముద్రఖని సినిమాల షూటింగ్ లలో పవన్ సెప్టెంబర్ నెల నుండి బిజీ కాబోతున్న పరిస్థితులలో ‘హరి హర వీరమల్లు’ ఎప్పటికి పూర్తి అవుతుంది అంటూ ఇండస్ట్రీలో కొంతమంది తమ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న ఈసినిమాలు ఆంధ్రప్రదేశ్ లో రగులుతున్న రాజకీయాల వేడి మధ్య ఎప్పుడు పూర్తి అవుతాయి అన్నది ఒక ప్రశ్నగానే కొనసాగుతోంది..
మరింత సమాచారం తెలుసుకోండి: