సినిమా పరిశ్రమలో సక్సెస్ అనేది ఉంటే మంచి గౌరవం లభిస్తుంది. హీరోల కైనా దర్శకులకైన సక్సెస్ అనేది తప్పనిసరి అయిపోయింది ఈ రోజులలో. అయితే అతి తక్కువ సమయంలో సినిమాలు చేసి సక్సెస్ సాధిస్తే ఆ గౌరవ మర్యాదలు కాస్త రెట్టింపు అవుతాయి. అలాంటి దర్శకులు తెలుగు సినిమా పరిశ్రమలు చాలా తక్కువగా ఉన్నారని చెప్పాలి.  ఇటీవల కాలంలో ఆ విధంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

ఆయన తొలి సినిమా దగ్గరనుంచి ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలతోనూ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడమే మాత్రమే కాకుండా అతి తక్కువ వ్యవధిలో సినిమాలు తెరకెక్కించి నిర్మాతకు భారీ లాభాలు వచ్చేలా చేస్తున్నాడు. మహేష్ తో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా ను కూడా తక్కువ సమయంలోనే పూర్తి చేశాడు. పెద్ద హీరో సినిమా ను కూడా అలా చేయడం నిజంగా అనిల్ రావిపూడి కే సాధ్యం.  అందుకే ఈ దర్శకుడితో సినిమా చేయాలని చాలామంది హీరోలు భావిస్తున్నారు. ఇటీవల ఎఫ్ త్రీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు బాలకృష్ణ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. 

ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ సినిమాను అలా అనౌన్స్ చేశారో లేదో అప్పుడే అనిల్ ఈ చిత్రా నికి సంబంధించిన పూర్తి స్క్రిప్టును సిద్ధం చేశాడన్న వార్తలు వస్తున్నాయి. ఎఫ్ త్రీ సినిమా విడుదల ఈ నెల రోజులు కాకముందే ఈ చిత్రాన్ని ఆయన షూటింగ్ చేయడానికి రెడీ అవు తూ ఉండడం అందరిని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని దసరా పండుగ ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతుండగా త్వరలోనే అనిల్ రాగిపూడి తో కలిసి సినిమాను మొదలు పెట్టబోతున్నాడు బాలకృష్ణ. 

మరింత సమాచారం తెలుసుకోండి: