ఈవారం విడుదలవుతున్న ‘బింబిసార’ ‘సీతా రామం’ మూవీల క్లాష్ అత్యంత ఆశక్తిదాయకంగా మారింది. ఒక సోషియో ఫ్యాంటసీ మూవీతో మరో లవ్ స్టోరీ పోటీ పడుతూ ఉండటంతో ఈ రెండు డిఫరెంట్ మూవీలలో ఏసినిమాకు ఎక్కువ ఆదరణ లభిస్తుంది అన్నవిషయమై తలలు పండిన వారికి కూడ అంచనాలు అందడంలేదు.


దీనికికారణం ఈరెండు సినిమాల పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల పబ్లిసిటీ కూడ భారీ స్థాయిలో చేసారు. దీనితో ఈవారం విజేత ఎవరు అన్న విషయమై బాగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈమూవీకి యంగ్ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నాడు. అతడి కథను నమ్మి ప్రస్తుతం పరాజయాల బాటలో ఉన్న కళ్యాణ్ రామ్ ఈమూవీ పై 40 కోట్లు భారీ బడ్జెట్ పెట్టడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.


చరిత్రలో బింబిసారుడు గురించి కథలు కథలుగా చెపుతారు. 5వ శతాబ్దానికి చెందిన బింబిసారుడు చాల క్రూరమైన చక్రవర్తిగా రాజ్యాన్ని పాలించాడని చరిత్రకారుల అభిప్రాయం. ఇప్పటివరకు ఎవరూ ఎరగని ఆ చక్రవర్తి సామ్రాజ్యంలోని ఒక నిధి కోసం బింబిసారుడి అంశతో జన్మించిన ఒక యువకుడి జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది అన్న ఒక కొత్త కథ ఈమూవీలో ఉంటుంది అంటున్నారు.


వాస్తవానికి ఈమూవీ కథ వ్రాసుకున్న తరువాత రవితేజా అల్లు శిరీష్ లకు ఈకథను వినిపించాడని టాక్. అయితే ఈకథ వారికి నచ్చక పోవడంతో 2019లో ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్రలో నటిస్తున్న కళ్యాణ్ రామ్ కు తన వద్ద ఒక ప్యాంటసీ కథ ఉంది అంటూ పెట్టిన ఒక మెసేజ్ చూసి కళ్యాణ్ రామ్ తనను పిలిపించి తన కథ వినడంతో ఈమూవీ అనుకోకుండా ఫైనల్ అయింది అని అంటున్నాడు దర్శకుడు వశిష్ట్. సాధారణంగా ఒక టాప్ హీరో వదులుకున్న ఒక కథ మరొక హీరోకి హిట్ ఇచ్చిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్ రిపీట్ అయితే కళ్యాణ్ రామ్ దశ తిరిగినట్లే..  మరింత సమాచారం తెలుసుకోండి: