టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ ఫిల్మ్ లైగర్ (Liger). ఈ సినిమా కోసం సౌత్ టూ నార్త్ ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. పోస్టర్స్ ఇంకా అలాగే టీజర్‏తో సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి.అలాగే ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్‏లో మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్‏తోనే సినిమా పై చాలా హైప్ క్రియేట్ చేశారు. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీలో విజయ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తుండగా.. ఇంకా మథర్ పాత్రలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించనుంది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ సెన్సార్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంది.సెన్సార్ బోర్డ్ ప్రకారం లైగర్ చిత్రం దాదాపు 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. 


యాక్షన్ సీక్వెన్స్, పాటలతో పాటు ఇంకా ఈ మూవీలో మరిన్ని సన్నివేశాలు ఆకట్టుకునే సన్నివేశాలు చాలా ఉన్నాయి. బాక్సర్ పాత్రలో విజయ్ దేవరకొండ నటన అదిరిపోయిందని.. ఇక అనన్య అలాగే రమ్యకృష్ణ తమ పాత్రలో జీవించేసినట్లు తెలుస్తోంది. సాంగ్స్ అండ్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని.. ఇంకా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకోనుందని సమాచారం.ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే నార్త్ లో విజయ్ క్రేజ్ చాలా ఎక్కువగానే పెరిగిపోయింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో ఆగస్ట్ 25 వ తేదీన విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఈ సినిమా టీం చాలా నమ్మకంగా వున్నారు.వరుస ప్లాపులతో వున్న విజయ్ కి ఈ సినిమా బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: