నందమూరి కళ్యాణ్ రామ్ దాదాపుగా రెండు సంవత్సరాల తర్వాత బింబిసారా సినిమాతో ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. దాదాపుగా రెండు నెలలుగా తెలుగు సినీ ఇండస్ట్రీకి సరైన హిట్టు లేక వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న సమయంలో బింబి సారా, సీతారామం సినిమాలు మంచి ఊపును తెచ్చిపెట్టాయి. ఇక దీంతో అన్ని వర్గాల నుంచి ఈ సినిమా హీరోలపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బింబి సార సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ వశిష్ట అని చెప్పవచ్చు.ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని రూపొందించారు ఇక పశువుల పరంగా మూడు రోజులలోనే మంచి కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది కళ్యాణ్ రామ్ నటిస్తున్న తన తదుపరిచిత్రం పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక దీంతో అందరు దృష్టి తన తదుపరి సినిమా పైన పడిందని చెప్పవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే పీరియాడిక్ సినిమాగా తర్వాత కళ్యాణ్ రామ్ నటిస్తున్న మరొక పీరియాడికల్ చిత్రం"డెవిల్" ఈ సినిమా బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్ లో కూడా పెట్టడం జరిగింది అభిషేక్ పిక్చర్ బ్యానర్ పై అభిషేక్ నాయ నిర్మిస్తున్నారు.


ఈ చిత్రానికి డైరెక్టర్గా నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 1940వ కాలం నాటి కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు ఇందులో కూడా కళ్యాణ్ రామ్ అత్యంత ఘోరమైన బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా నటించబోతున్నట్లు సమాచారం అందుకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా గతంలో విడుదల చేశారు. దీంతో ఈ పోస్టర్ చూసిన అభిమానులు కూడా ఈ సినిమా పైన మరింత అంచనాలను పెంచేసాయని చెప్పవచ్చు. ఇక కళ్యాణ్ రామ్ ట్రైన్ నుంచి దిగుతూ బ్లాక్ కలర్ బ్లేజర్లు చాలా క్రూరంగా కనిపిస్తూ ఉన్నటువంటి లుక్ ఫోటో విడుదల చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: