ఇప్పటివరకు స్టార్ హీరోల సినిమాలు ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేసాయి అన్న పోటీ టాప్ హీరోల అభిమానుల మధ్య ఉండేది. అయితే ఈసంవత్సరం నుండి ట్రెండ్ మారింది. తమ హీరోల పుట్టినరోజునాడు గతంలో బ్లాక్ బష్టర్ హిట్ సాధించిన తమ హీరోల సినిమాలను స్పెషల్ షోలుగా మళ్ళీ వేయించి ఆసినిమాలకు తమ హీరోల పుట్టినరోజు సందర్భంగా రికార్డ్ కలక్షన్స్ వచ్చేడట్లు చేసి హంగామా చేయడం ఇప్పుడు టాప్ హీరోల అభిమానులలో లేటెస్ట్ ట్రెండ్ గా మారింది.


ఈమధ్య జరిగిన మహేష్ బాబు పుట్టినరోజునాడు అతడి అభిమానులు ‘పోకిరి’ సినిమాను తిరిగి రీ రిలీజ్ చేయించి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు చెన్నై యుఎస్ ఏ లలో భారీగా 375 షోలు వేయించి దాదాపు కోటికి పైగా కలక్షన్స్ వచ్చేలా చేసారు. దీనితో ఎలర్ట్ అయిన పవన్ అభిమానులు పవన్ పుట్టినరోజునాడు అతడి బ్లాక్ బష్టర్ మూవీ ‘జల్సా’ 4కె లోకి రీ మాస్టర్ ప్రింట్ గా మార్చి ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 700 ధియేటర్లలో విడుదల అయ్యేలా చేసిన హంగామా పవన్ మ్యానియాను సూచిస్తోంది.


అంతేకాదు ధియేటర్లలో ‘జల్సా’ మూవీని చూస్తూ పవర్ స్టార్ అబిమానులు హంగామా క్రియేట్ చేసారు. కొన్ని ధియేటర్లలో అయితే స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కనిపించగానే హారతులు ఇవ్వడంతో ధియేటర్ల స్క్రీన్స్ ఎక్కడ కాలిపోతాయో అని ధియేటర్ల అభిమానులు భయపడినట్లుగా వార్తలు వినిపించాయి. ఇప్పుడు మహేష్ పవన్ అభిమానుల హడావిడి చూసి ప్రభాస్ అభిమానులలో కొత్త ఆలోచనలు మొదలైనట్లు తెలుస్తోంది.


అక్టోబర్ లో రాబోతున్న ప్రభాస్ పుట్టినరోజునాడు ‘బిల్లా’ మూవీని 4కెలోకి మార్చి విడుదల చేయాలనే డిమాండ్ ప్రభాస్ అభిమానుల నుండి వస్తోంది. ఈ పరిణామాలు చూసే జూనియర్ అభిమానులు ఫీల్ అవుతున్నట్లు టాక్. ఆమధ్య జరిగిన తారక్ పుట్టినరోజునాడు తాము అలాంటి హడావిడి ఎందుకు చేయలేకపోయాము అంటూ జూనియర్ అభిమానులు మధన పడుతున్నట్లు టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి: