ఒక ప్రాజెక్ట్ ఎంపిక విషయంలో కొందరు స్టార్స్ కచ్చితంగా వ్యవహరిస్తారు.అయితే  గత కొన్నాళ్లుగా ప్రముఖ హీరో హీరోయిన్లు పలు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు గుడ్ బై చెప్పిన సంఘటనలున్నాయి.ఇక ఇప్పుడు ఇలాంటి సంఘటన ఒకటి చర్చనీయాంశమవుతోంది.అయితే  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి పల్లవితో కలిసి పనిచేయడానికి నో చెప్పాడు.ఇకపోతే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ‘భవదీయుడు భగత్ సింగ్’ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇందులో సాయిపల్లవిని హీరోయిన్ పరిశీలించారని, 

అందుకు పవన్ కళ్యాన్ నో చెప్పారని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో ఇద్దరు మహిళా కథానాయికలు నటించనున్నారు.అయితే  అందులో ఒకరు పూజా హెడ్గే ఖరారు కాగా, రెండో నటి కోసం మేకర్స్ వెతుకుతూనే ఉన్నారు. ఇక ఫిదా నటి పేరును దర్శకుడు హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్‌కి సూచించారట. అయితే సాయి పల్లవికి ''మహిళా కథానాయిక''గా పేరుండటంతో పవన్ ఆసక్తి చూపలేదని టాక్.కాగా  దీని గురించి అధికారికంగా తెలియాల్సింది ఉంది. అయితే ఇక  సాయి పల్లవి పేరును సినిమా నుండి తొలగించడానికి మరో కారణం కూడా ఉంది. ఆమె ఇప్పటివరకు స్క్రీన్ పై బోల్డ్ గా నటించకపోవడం

కూడా ప్రధాన కారణంగా తెలుస్తోంది.ఇకపోతే సాయి పల్లవి గతంలో ప్రముఖ నటీనటుల ఆఫర్‌లను ఇవే కారణాల వల్ల తిరస్కరించింది.ఇక  డియర్ కామ్రేడ్ (విజయ్ దేవరకొండ), సరిలేరు నీకెవ్వరు (మహేష్ బాబు), భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్) లాంటి చిత్రాలను ఆమె రిజెక్ట్ చేసింది. ఇదిలావుంటే ఇటీవల చిరంజీవి సినిమా ఆఫర్‌ను కూడా రిజెక్ట్ చేసింది. ఇక ఇందులో ఆమెకు భోళా శంకర్ చిత్రంలో సిస్టర్ పాత్రను ఆఫర్ చేశారు.అయితే  తరువాత ఓ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో చిరు ఆ విషయాన్ని ప్రస్తావించారు.కాగా  దానికి సాయిపల్లవి చిరునవ్వు నవ్వుతూ చిరుతో ప్రధాన కథానాయికగా నటించడానికి ఇష్టపడతానని సమాధానం ఇచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: