టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోయిన్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. సమంత తన కెరియర్ లో ఇప్పటికే ఎన్నో కమర్షియల్ మూవీ లలో తన అందచందాలను ఆరబోయడం మాత్రమే కాకుండా , ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో తన నటన తో కూడా ప్రేక్షకులను ఆలరించింది. అలాగే పోయిన సంవత్సరం పుష్ప ది రైస్ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించి తన అంద చందాలతో కూడా సమంత ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా సమంత "యశోద" అనే లేడీ ఓరియంటెడ్ పాన్ ఇండియా మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. హరి శంకర్ , హరీష్ నారాయణ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో ఉన్ని  ముకుందన్ ,  వరలక్ష్మి శరత్ కుమార్ , రావు రమేష్ , మురళి శర్మ ముఖ్య పాత్రలలో నటించగా , మణిశర్మమూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. ఈ మూవీ ని డిసెంబర్ 9 వ తేదీ నుండి తెలుగు , తమిళ , మలయాళ ,  కన్నడ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా అధికారికంగా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ప్రకటించింది. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: