తమిళ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న తలపతి విజయ్ తాజాగా తమిళంలో రూపొందిన వారిసు అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మంచి టాలెంట్ కలిగిన దర్శకుడు అయినటు వంటి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో మూవీ లను నిర్మించి అత్యద్భుతమైన టాలెంట్ ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

మూవీ తమిళ వర్షన్ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. తెలుగు లో ఈ మూవీ వారసుడు అనే పేరుతో విడుదల అయింది. ఈ మూవీ తెలుగు వర్షన్ జనవరి 14 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను తెచ్చుకుంది. తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి కలక్షన్ ను తెచ్చుకున్న ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ మూవీ గా నిలిచింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ మూవీ ఇప్పటికే సౌత్ భాషలలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటు లోకి వచ్చింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటు లోకి వచ్చింది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ మూవీ హిందీ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ మూవీ లో రష్మిక మందన విజయ్ సరసన హీరోయిన్ గా నటించగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీకాంత్మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: