టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ శౌర్య ఇప్పటికే అనేక మూవీ ల ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఫలానా అబ్బాయి పలానా అమ్మాయి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. 

మూవీ ఈ నెల మార్చి 17 వ తేదీన మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో భారీ మొత్తంలో విడుదల ఆయన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ కలెక్షన్ లు కూడా దక్కడం లేదు. మరి ఈ మూవీ లాంగ్ రన్ లో ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో ... ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే తాజాగా నాగ శౌర్య కొత్త మూవీ కి సంబంధించిన అప్డేట్ ను ప్రకటించాడు.

నాగ శౌర్య తన కెరియర్ లో 23 వ మూవీ కి సంబంధించిన అప్డేట్ ను తాజాగా ప్రకటించాడు. ఈ మూవీ కి పవన్ బేసం శెట్టి దర్శకత్వం వహించనుండగా ... సుధాకర్ చెరుకూరి ఈ మూవీ కి నిర్మాతగా వ్యవహరించినట్లు ప్రకటించారు. అలాగే ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ ను ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: