తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న సమంత తాజాగా శాకుంతలం అనే మూవీ లో కీలక పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి క్రేజీ దర్శకుడు అయినటు వంటి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ ల స్పీడ్ ను పెంచింది.

అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి రోజుకో పోస్టర్ ను విడుదల చేస్తూ సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ మూవీ యూనిటీ ఈ సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో కబీర్ బేడి "సాగే కశ్యప" అనే పాత్రలో నటించబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

 ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు భారీగా ఉన్నాయి.  మరి ఈ మూవీ ఏ రేంజ్  విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి. సమంత ఆఖరిగా యశోద మూవీ తో మంచి విజయం అందుకుంది ... దానితో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: