టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ఫుల్ జోష్ లో మూవీ లలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే అనేక మూవీ లలో హీరో గా నటించిన ఈ యువ హీరో రాజా వారు రాణి గారు ... ఎస్ ఆర్ కళ్యాణ మండపం ... సమ్మతమే ... వినరో భాగ్యము విష్ణు కథ మూవీ లతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇలా ఇప్పటికే కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని నటుడుగా మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న కిరణ్ తాజాగా మీటర్ అనే మూవీ లో హీరో గా నటించాడు. రమేష్ కాడురి దర్శకత్వం వహించిన ఈ మూవీ కి ... శ్రీ కార్తీక్ సంగీతం అందించాడు.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ డబ్బింగ్ పనులను కూడా కిరణ్ పూర్తి చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా కిరణ్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది.

మూవీ ట్రైలర్ విడుదల సమయాన్ని ఈ రోజు ఉదయం 10 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇప్పటికే వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తో ఈ సంవత్సరం మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న కిరణ్ మీటర్ మూవీ తో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: