
ఏకంగా బలగం అనే చిన్న మూవీ తో వండర్ క్రియేట్ చేశాడు వేణు. దీంతో ఇక జబర్దస్త్ వేణు కాస్త ప్రస్తుతం బలగం వేణు గా మారిపోయాడు అని చెప్పాలి. ఇక తెలంగాణలోని సాంప్రదాయాలు కట్టుబాట్లు చూపిస్తూనే మనుషుల మధ్య కనుమరుగవుతున్న బంధాలను గుర్తు చేస్తూ అందరి మనసులను మెలిపెట్టేశాడు వేణు. ఇక ఈ సినిమా ఆశించిన దానికంటే సూపర్ హిట్ సాధించింది అని చెప్పాలి. దీంతో ఇక ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసాడు అన్నది తెలుస్తుంది. అయితే కేవలం కమెడియన్ గా మాత్రమే కాదు అటు డైలాగు రైటర్ గా కూడా ప్రస్థానాన్ని కొనసాగించిన వేణు.. ఇటీవల స్వయంగా రాసుకున్న బలగం కథను ఇక తన దర్శకత్వంలోనే తీసి హిట్టు కొట్టగా నిర్మాత దిల్ రాజుకి భారీగా లాభాలు వచ్చాయి.
ఇంకేముంది తనకు లాభాలు తెచ్చి పెట్టిన దర్శకుడు వేణు కి మరో బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు అటు దిల్ రాజు కూడా సిద్ధమయ్యాడు అనేది తెలుస్తుంది. స్టోరీ రెడీ చేసుకో.. నీకు కావాల్సిన హీరో డేట్స్ నేను ఇప్పిస్తా.. అది స్టార్ హీరో అయినా సరే.. భారీ బడ్జెట్ కూడా పెట్టేందుకు నేను రెడీ అని బంపర్ ఆఫర్ ఇచ్చేసాడట నిర్మాత దిల్ రాజు. దీంతో ఇక దిల్ రాజు ఇచ్చిన ఆఫర్ ని వాడుకొని స్టార్ డైరెక్టర్ గా మారాలని వేణు అనుకుంటున్నాడట. ఇందుకోసం ఒక పవర్ఫుల్ స్టోరీని రాసుకోవాలని సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇన్నేళ్ల తర్వాత బలగం మూవీతో వేణు కెరియర్ టర్న్ అయిందని చెప్పాలి.