మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . గోపీచంద్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా ... విలన్ గా నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే గోపీచంద్ తన కెరియర్ లో ఎక్కువ శాతం మాస్ మూవీ లలో హీరో గా నటించి వాటి తోనే ఎక్కువ శాతం విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాస్ హీరో గా కెరియర్ కొనసాగిస్తున్నాడు.

 గోపీచంద్ ఆఖరుగా మారుతీ దర్శకత్వంలో రాసి కన్నా హీరోయిన్ గా రూపొందిన పక్కా కమర్షియల్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం గోపీచంద్ ... శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందుతున్న రామబాణం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో గోపీచంద్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం గ్లింమ్స్ పేరుతో ఒక వీడియోను విడుదల చేసింది. దీనికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు యూట్యూబ్ లో 1.5 మిలియన్ వ్యూస్ ... 8.9 కే లైక్స్ లభించాయి. ఇలా ఈ మూవీ లోని ఈ చిన్న వీడియోకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో జగపతి బాబు ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టిజి విశ్వప్రసాద్ వివేక్ కూచిభొట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: