ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అల్లు స్టూడియోస్ పూర్తయ్యే లోపు ‘ఆహా’ ని ఒక గ్లోబల్ బ్రాండ్ చేయాలని అల్లు అరవింద్ మాష్టర్ ప్లాన్ లో ఉన్నట్లు టాక్. దీనితో ఆహా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో మార్పులు చేసి ఓటీటీ నిర్వహణలో బాగా అనుభవం ఉన్నవారిని కూడ ఆహా బోర్డ్ లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వందల కోట్లు పెట్టుబడి పెట్టిన ‘ఆహా’ యాజమాన్య రాబోయే మూడేళ్ళ కాలానికి సుమారు 1000 కోట్లు పెట్టుబడి పెట్టాలి అన్న ఉద్దేశ్యంతో దీనికి సంబంధించిన వ్యాపారాల వ్యవహారాల పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గ్లోబల్ మార్కెట్ లో పోటీ పడాలంటే రాజీ పడకూడదనే ఉద్దేశ్యంతో ఈ ప్లాన్ కు శ్రీకారం చుట్టినట్లు టాక్. వాస్తవానికి ప్రస్తుతం ఆహా చెప్పుకోతగ్గ లాభాలను గణించలేకపోతోంది అన్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో ఉన్నాయి. ఆహా చందాను తక్కువగా పెట్టినప్పటికీ ఇంకా చాలామందికి సంబంధించిన తెలుగువారి ఇళ్ళల్లో ఆహా ఎక్కడా కనిపించడంలేదు. దీనితో ఒరిజనల్ కంటెంట్ పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు ఆహా చేస్తోంది. ‘అన్ స్టాపబుల్’ ‘ఇండియన్ ఐడల్’ లాంటి షోలకు మంచి స్పందన వచ్చినప్పటికీ ఒరిజనల్ కంటెంట్ విషయంలో ఇంకా ఆహా మిగతా ఓటీటీ ఛానల్స్ ముందు వెనుకపడి ఉంది అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ‘ఆహా’ ను మరింత అభివృద్ధి చేయడానికి అరవింద్ మైహోమ్ గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు విజయవంతం అవుతాయో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి