టాప్ యంగ్ హీరోలు మహేష్ జూనియర్ చరణ్ అల్లు అర్జున్ లు సంవత్సరానికి ఒక్క సినిమాను కూడ ఖచ్చితంగా పూర్తి చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇక నుంచి తన నుండి సంవత్సరానికి రెండు సినిమాలు వస్తాయని అవకాశం ఉంటే మూడు సినిమాలు వచ్చినా ఆశ్చర్యంలేదు అంటూ అతడు చేసిన కామెంట్స్ అభిమానులకు విపరీతమైన జోష్ ను ఇస్తే టాప్ యంగ్ హీరోలకు మాత్రం షాక్ ఇస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.ప్రస్తుతం ప్రభాస్ కు ఉన్న మ్యానియా రీత్యా సినిమాకు 100 కోట్ల పారితోషికాన్ని ఇస్తున్నారు. ఇలాంటి పారితోషికం తీసుకుని సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తే ప్రభాస్ తీసుకునే ఎవరు అందుకోలేరు అన్నది వాస్తవం. ఇది ఇలా ఉంటే ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన వేలాదిమంది వర్షం పడుతున్నా చెదరకపోవడం ప్రభాస్ ను చూడటానికి అమ్మాయిలు ఆడిటోరియం గోడలు దూకి రావడం చేతిలో కాషాయ జెండాలు పట్టుకుని ‘జై శ్రీరామ్’ అంటూ గట్టిగా నినాదాలు చేయడం చూసిన వారికి ఇది అంతా యూత్ లో పెరిగిపోతున్న శ్రీరాముడు పై ఉన్న భక్తి అనుకోవాలా లేదంటే ప్రభాస్ మ్యానియా అనుకోవాలా అంటూ ఆశ్చర్యపోయారు.


ఈఈవంట్ కు వచ్చి విఐపి గ్యాలరీలో కూర్చున్న అనేకమంది అధికారుల కుటుంబ సభ్యులు కూడ చేతిలో ‘ఆదిపురుష్’ జెండాలు పుచ్చుకుని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు ఈసినిమాకు ఏర్పడిన మ్యానియా ఈమూవీ విడుదల తరువాత కూడ ఇదే విధంగా కొనసాగితే 10 రోజులు పూర్తి కాకుండానే ఈమూవీ 1000 కోట్ల కలక్షన్స్ మార్క్ ను అందుకోవడం ఖాయం అంటున్నారు.


మూవీ విడుదల తరువాత సెప్టెంబర్ లో ‘సాలార్’ రాబోతోంది. సంక్రాంతికి ప్రాజెక్ట్ కె వస్తోంది. ఈసినిమాల పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఊహించిన స్థాయిలో ఈమూడు సినిమాలు విజయం సాధిస్తే ప్రభాస్ రేంజ్ టాలీవుడ్ టాప్ హీరోలలో ఎవరికీ అందదు అన్న విషయం మాత్రం వాస్తవం..మరింత సమాచారం తెలుసుకోండి: