స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. జూన్ 16న పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదల కాబోతోంది .ఇక ప్రభాస్ కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఊహించని విధంగా జరిగింది. సుమారు 500 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా అదే స్థాయిలో థియేట్రికల్ హక్కులను కూడా ప్రొడ్యూసర్లు అమ్ముకున్నారు. అయితే కేవలం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఆదిపురుష్ సినిమా బిజినెస్ ఏకంగా 150 కోట్లు కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నైజం ఏరియాలో 60 కోట్లు ఆంధ్రాలో 70 కోట్లు సీడెడ్ లో 20 కోట్ల కు ఈ హక్కులు అమ్ముడయ్యాయి. 

ప్రభాస్ సినీ కెరియర్ చూసుకుంటే ఆయన నటించిన సినిమాల్లో అతి పెద్ద ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమా ఇదే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాబట్టి ఓపెనింగ్ కూడా అదిరిపోవడం ఖాయమని అంటున్నారు. తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అదే సందడి నెలకొనాలి అంటే సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ రావాల్సి ఉంటుంది. 150 కోట్ల మార్క్ దాటడం అంటే అంత తేలికైన పని కాదు. ప్రస్తుతం ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో భారీ బిజినెస్ జరుగుతుంది.

ఇక రామాయణం ఆధారంగా రాబోతున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించడంతో ఈ సినిమా ట్రైలర్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిన్న తిరుపతిలో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఇక ఆ ఈవెంట్ కి లక్షల్లో ప్రభాస్ అభిమానులు వచ్చారు. ఈ సందర్భంగా వాళ్లను ఉత్సాహపరిచే విధంగా మాట్లాడాడు ప్రభాస్. అంతేకాదు ఇప్పటినుండి ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు కూడా రావచ్చు అని.. అంతే కాదు తిరుపతిలోనే పెళ్లి కూడా చేసుకుంటాను అని చెప్పుకొచ్చాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: