దీనికి తగ్గట్టుగానే ఈసినిమాకు సంబంధించిన ప్రతి అప్ డేట్ అభిమానులలో ఈమూవీ పై విపరీత మైన అంచనాలు పెంచుతున్న్నాయి. సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
ఈప్రకటనకు సంబంధించిన పోస్టర్ లో డిటైలింగ్ చూశాక సినిమాపై పవన్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి.ఈసినిమా కథ ముంబయి బ్యాక్ డ్రాప్ లో నడిచే నేపధ్యంలో ఈమూవీ షూటింగ్ అంతా ముంబై లోనే జరుగుతోంది. లేటెస్ట్ గా విడుదల అయిన ఈ మూవీ ప్రి లుక్ పోస్టర్‌లో ఒక పెద్ద భవంతి ముందు అర్ధరాత్రి వేళ కొంతమంది గూండాలను మట్టుబెట్టి తన గ్యాంగ్ తో కలిసి ముందుకు సాగుతున్న హీరో పవన్ ను బ్యాక్ లుక్‌లో చూపించారు.
డీటైలింగ్ ఇస్తూ లొకేషన్ చర్చ్ గేట్ సౌత్ బొంబాయి టైమ్ 2.18 ఏఎం రెయిన్ ఫాల్ డెన్సిటీ: 24 ఎంఎం బ్లడ్ ఫ్లో డెన్సిటీ 32 ఎంఎంఅంటూ ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడ ఇచ్చాడు. ‘వర్షపు ధారను మించి రక్తపు ధార పెద్దది’ అంటూ ఇచ్చిన హింట్ తో పవన్ అభిమానులలో ఈమూవీ పై మరింత ఆశక్తి పెరిగింది. ఈమూవీ ‘గబ్బర్ సింగ్’ స్థాయిని మించి ఉంటుందని అంచనాలు వస్తున్నాయి. ఈమూవీని డిసెంబర్ లో విడుదల చేసి ‘బ్రో’ షాక్ తో ఉన్న పవన్ అభిమానులకు ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని చాల గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి