తమిళ స్టార్‌ హీరో  విజయ్ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం లియో. స్టార్ డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంకా టైటిల్‌ ప్రోమో గ్లింప్స్ వీడియోతోపాటు నా రెడీ సాంగ్‌ ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.వినాయక చవితి కానుకగా లియో మూవీ నుంచి తెలుగు, కన్నడ పోస్టర్‌లను విడుదల చేసిన చిత్రబృందం.. విడుదల తేదీ దాకా ప్రతి రోజు కూడా ఒక కొత్త పోస్టర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే చిత్రబృందం తాజాగా ఓ సాలిడ్ అప్‌డేట్ కూడా ఇచ్చింది. ఈ మూవీ నుంచి నేడు సాయంత్రం 6 గంటలకు లియో కొత్త పోస్టర్ ని విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో తెలిపింది.


ఇక లియో సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, ప్రియా ఆనంద్‌, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌ ఇంకా సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంజయ్‌ దత్‌ ఆంటోనీ దాస్‌ గ్లింప్స్ కూడా ఇప్పటికే నెట్టింటిని బాగా షేక్ చేస్తోంది.భారీ యాక్షన్‌ జోనర్‌లో వస్తోన్న ఈ సినిమా అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోపై నిర్మిస్తున్న ఈ సినిమాకి  అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. లోకేశ్‌ కనగరాజ్‌, రత్నకుమార్‌, ధీరజ్‌ వైడీ ఈ మూవీకి డైలాగ్స్ రాస్తున్నారు.ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రముఖ హాలీవుడ్ హిట్ మూవీ హిస్టరీ ఆఫ్ వయోలెన్స్ కి రీమేక్ అని సమాచారం తెలుస్తుంది. ఈ సినిమాని జగపతి బాబు 2010 లో గాయం 2 అనే పేరుతో రీమేక్ చేశాడు. మరి 13 సంవత్సరాల క్రితం జగపతి బాబు రీమేక్ చేసిన ఈ సినిమాని ఇప్పుడు లోకేష్ విజయ్ తో తీసి ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: